తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gurmeet Ram Rahim : ఆ కేసులో డేరా బాబా గుర్మీత్​ రామ్​ రహీమ్​ నిర్దోషి..!

Gurmeet Ram Rahim : ఆ కేసులో డేరా బాబా గుర్మీత్​ రామ్​ రహీమ్​ నిర్దోషి..!

Sharath Chitturi HT Telugu

28 May 2024, 13:00 IST

google News
  • Gurmeet Ram Rahim news : మాజీ మేనేజర్​ హత్య కేసులో.. డేరా సచ్​ సౌదా చీఫ్​ గుర్మీత్​ రామ్​ రహీమ్​కి క్లీన్​ చిట్​ ఇచ్చింది పంజాబ్​- హరియాణా హైకోర్టు. మరో నలుగురిని కూడా నిర్దోషిగా తేల్చింది.

డేరా సచ్​ సౌదా చీఫ్​ గుర్మీత్​ రామ్​ రహీమ్
డేరా సచ్​ సౌదా చీఫ్​ గుర్మీత్​ రామ్​ రహీమ్

డేరా సచ్​ సౌదా చీఫ్​ గుర్మీత్​ రామ్​ రహీమ్

Gurmeet Ram Rahim acquitted : సంచలనాలకు కేరాఫ్​ అడ్రెస్​గా ఉండే డేరా సచ్​ సౌదా చీఫ్​ గుర్మీత్​ రామ్​ రహీమ్​​.. ఓ మర్డర్​ కేసులో తాజాగా నిర్దోషిగా తేలారు! మాజీ మానేజర్​ హత్య కేసు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రహీమ్​తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా తేల్చుతూ మంగళవారం కీలక తీర్పును వెలువరించింది పంజాబ్​- హరియాణా హైకోర్టు.

ఇదే కేసులో.. డేరా బాబాగా గుర్తింపు పొందిన రహీమ్​తో పాటు ఆ నలుగురిని దోషిగా తేల్చుతూ.. 2021లో జీవిత ఖైదు శిక్ష వేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. దానిపై విచారణ చేపట్టిన అనంతరం.. ఈ ఐదుగురిని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు.

'మాజీ మేనేజర్​ హత్యలో గుర్మీత్​ నిర్దోషి..'

19ఏళ్ల క్రితం, 2002 జులై 10న.. డేరా మాజీ మేనేజర్​ రంజిత్​ సింగ్​ని కొందరు కాల్చి చంపేశారు. హరియాణా కురుక్షేత్రంలోని కాన్పూర్​ కోలియన్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. డేరా హెడ్​క్వార్టర్స్​లో గుర్మీత్​ రామ్​​ రహ్మీమ్​.. మహిళపై లైంగిక దాడికి పాల్పడుతున్నారంటూ.. నాడు కొన్ని లేఖలు కలకలం సృష్టించాయి. దీని వెనుక.. మేనేజర్​ రంజిత్​ సింగ్​ హస్తం ఉందన్న అనుమానంతో, ఆతడిని గుర్మీత్​ చంపించారని ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో నివాసముండే సాధ్వీలపై గుర్మీత్​ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని లేఖలో ఉంది. ఇదే లెటర్​ ఆధారంగా.. సిర్సాలోని జర్నలిస్ట్​ రామ్​ చందర్​ ఛత్రపతి.. ఓ పెద్ద రిపోర్టును రూపొందించారు. ఇది.. కేసులో కీలకంగా మారింది.

Gurmeet Ram Rahim latest news : సెక్షన్​ 302ఏ, సెక్షన్​ 120బీ, సెక్షన్​ 506 కింద కేసులు ఎదుర్కొంటున్న గుర్మీత్​ రామ్​ రహీమ్​​తో పాటు అవతార్​ సింగ్​, జస్బీర్​ సింగ్​, సబ్దిల్​ సింగ్​, కిషన్​ లాల్​లను తాజాగా పంజాబ్​- హరియాణా హైకోర్టు విడిచిపెట్టింది.

"మాజీ మేనేజర్​ రంజిత్​ సింగ్​ హత్య కేసులో డేరా సచ్​ సౌదా చీఫ్​ గుర్మీత్​ రామ్​ రహీమ్​​ని పంజాబ్​- హరియాణా హైకోర్టు నిర్దోషిగా తేల్చింది," అని తీర్పు వెలువడిన అనంతరం.. మీడియాతో చెప్పారు గుర్మీత్​ రామ్​ రహీమ్​​ న్యాయవాదులు.

Gurmeet Ram Rahim : కాగా.. గుర్మీత్​ రామ్​ రహీమ్​.. తన ఇద్దరు భక్తురాళ్లను రేప్​ చేసిన కేసులో 20ఏళ్ల శిక్ష ఎదుర్కొంటున్నారు. 2001 జర్నలిస్ట్​ రామ్​ చందర్​ ఛత్రపతి మర్డర్​ కేసులోనూ డేరా బాబా దోషిగా తేలారు. ఈ కేసులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నారు. 2015లో రాష్ట్రంలో జరిగిన అనేక మతపరైన విషయాలకు సంబంధించిన కేసుల్లోనూ డేరా బాబా హస్తం ఉందని పంజాబ్​ పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆయన.. హరియాణా రోహ్​తక్​లోని సునారియా జైలులో ఉన్నారు. కాగా.. ఇప్పటికే అనేకమార్లు పెరోల్​పై బయటకు వచ్చారు. ఇది.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తదుపరి వ్యాసం