Gurmeet Ram Rahim : పెరోల్‌పై బయటకొచ్చి.. గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో డేరా బాబా
24 January 2023, 12:06 IST
- Gurmeet Ram Rahim cuts cake with sword : డేరా బాబా ఇటీవలే బయటకొచ్చారు. తాజాగా ఆయనకు చెందిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేక్‌ను ఖడ్గంతో కట్ చేస్తూ ఆయన కనిపించారు.
పెద్ద కత్తితో కేక్ కట్ చేసిన డేరా బాబా
Gurmeet Ram Rahim cuts cake with sword : పెరోల్‌పై బయటకు వచ్చిన డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పెద్ద కత్తితో ఆయన కేక్‌ను కట్ చేస్తున్న దృశ్యాలు వాటిల్లో ఉన్నాయి.
'కనీసం 5 కేక్‌లు కట్ చేయాలి..'
రేప్, మర్డర్ కేసుల్లో 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా బాబా.. హరియాణ రోహ్తాక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి శనివారం పెరోల్‌పై బయటకొచ్చాడు. ఈ నెల 25న.. మాజీ డేరా చీఫ్ షాహ్ సంత్నమ్ సింగ్ జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు పెరోల్ కావాలని ఆయన చేసిన అభ్యర్థనను అధికారులు అంగీకరించారు. ఈ క్రమంలోనే పెద్ద కత్తి (ఖడ్గం)తో కేక్‌ను కట్ చేశారు.
Gurmeet Ram Rahim Singh news : "ఐదేళ్ల తర్వాత వేడుకలు జరుపుకునే అవకాశం దక్కింది. మరి కనీసం 5 కేక్లైనా కట్ చేయాలి కదా. ఇది మొదటిది మాత్రమే," అని ఆ డేరా బాబా చెబుతున్న మాటలు ఆ వీడియోలో వినిపించాయి.
పెద్ద కత్తులు, ఖడ్గాలను బహిరంగంగా ప్రదర్శించడం.. ఆయుధాల చట్టానికి వ్యతిరేకం.
ఇదీ కేసు..
Gurmeet Ram Rahim Singh case : ఇద్దరు మహిళా అనుచరులను రేప్ చేసిన కేసులో గుర్మీత్ రామ్ రహీంను దోషిగా తేల్చుతూ 2017 ఆగస్టులో తీర్పునిచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కాగా ఆయనపై అప్పటికే ఓ మర్డర్ కేసు విచారణలో ఉంది.
డేరా సంస్థ మాజీ మేనేజర్ రంజిత్ సింగ్.. 2002లో దారుణ హత్యకు గురయ్యాడు. కురుక్షేత్రలోని తన పొలంలో పనిచేసుకుంటుండగా.. కొందరు అతనిపై దాడి చేసి హత్య చేశారు. 2003లో ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. గుర్మీత్ రామ్ రహీంతో పాటు మరో నలుగురిపై 2008లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ. ముమ్మర దర్యాప్తు, విచారణ అనంతరం.. ఈ కేసులో డేరా బాబాను దోషిగా తేల్చుతూ సీబీఐ కోర్టు 2021 అక్టోబర్ 8న తీర్పునిచ్చింది.