College Student Gang Raped : బాయ్​ఫ్రెండ్​ కళ్ల ముందే.. కాలేజీ విద్యార్థిని రేప్​!-college student gang raped in front of boyfriend in tamil nadu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  College Student Gang Raped : బాయ్​ఫ్రెండ్​ కళ్ల ముందే.. కాలేజీ విద్యార్థిని రేప్​!

College Student Gang Raped : బాయ్​ఫ్రెండ్​ కళ్ల ముందే.. కాలేజీ విద్యార్థిని రేప్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 14, 2023 01:45 PM IST

Tamil Nadu College Student Gang Raped : ఓ కాలేజీ విద్యార్థిని.. తన బాయ్​ఫ్రెండ్​తో బయటకెళ్లింది. వారిద్దరిని అడ్డుకున్న కొందరు.. బాయ్​ఫ్రెండ్​పై దాడి చేశారు. అతని కళ్ల ముందే కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

బాయ్​ఫ్రెండ్​ కళ్ల ముందే.. కాలేజీ విద్యార్థిని రేప్​
బాయ్​ఫ్రెండ్​ కళ్ల ముందే.. కాలేజీ విద్యార్థిని రేప్​

College Student Gang Raped in Tamil Nadu : తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 20ఏళ్ల యువతిని కత్తితో బెదిరించి.. ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాయ్​ఫ్రెండ్​ కళ్ల ముందే ఆ యువతి గ్యాంగ్​ రేప్​నకు గురైంది!

ఇదీ జరిగింది..

బాధితురాలు, ఆమె బాయ్​ఫ్రెండ్​.. ఓ కాలేజీలో క్లాస్​మేట్లు. కాగా.. గురువారం సాయంత్రం వారిద్దరు బయటకు వెళ్లారు. కంచీపూరం జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో వారిద్దరిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు.

Tamil Nadu gang rape case : తొలుత.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. బాధితురాలు, ఆమె బాయ్​ఫ్రెండ్​ను అడ్డుకున్నారు. వారు మాస్కులు వేసుకుని ఉండటంతో ముఖాలు సరిగ్గా కనిపించలేదు. బాయ్​ఫ్రెండ్​ని కొట్టడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి.. మరో నలుగురు కూడా ఆ ఇద్దరితో చేరారు.

ఆ తర్వాత.. యువతిని కత్తితో బెదిరించి.. ఎవరూ లేని, చీకటి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఒకరి తర్వాత ఒకరు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Tamil Nadu student raped : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అత్యాచారం, లైంగిక దాడి కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు.

మహిళపై ఏడాదిగా..

Mumbai rape case : దేశంలో మహిళలు, బాలికలపై నేరాలు, అత్యాచారా ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకుంటానని చెబుతూ.. ఓ మహిళపై ఓ వ్యక్తి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది.

ముంబైకి చెందిన ఓ 21ఏళ్ల మహిళకు బ్రిజేష్​ పాల్​తో కొన్నేళ్ల క్రితం పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీనిచ్చి.. ఆ మహిళను లొంగదీసుకున్నాడు 22ఏళ్ల నిందితుడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా గొడవ పడే వాడు. చివరికి పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పాడు.

Mumbai crime news : "నన్ను పెళ్లి చేసుకుంటానని హామీనిచ్చాడు. నన్ను లైంగికంగా లొంగదీసుకున్నాడు. చివరికి పెళ్లి చేసుకోనని తేల్చేశాడు. నాపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. నా దగ్గర వేరే ఆప్షన్​ లేదు. అందుకే పోలీసులను ఆశ్రయించాను," అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఘటనపై సెక్షన్​ 376 కింద కేసు నమోదు చేసుకున్న దిదోసి పోలీస్​ స్టేషన్​ అధికారులు.. బ్రిజేష్​ పాల్​ను శుక్రవారం అరెస్ట్​ చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచి.. కస్టడీలోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి.. బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు హామీనిచ్చారు.

సంబంధిత కథనం