తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Crime News : లైంగిక దాడిని భరించలేక.. టీచర్​ను గొంతు కోసి చంపిన బాలుడు!

Delhi crime news : లైంగిక దాడిని భరించలేక.. టీచర్​ను గొంతు కోసి చంపిన బాలుడు!

Sharath Chitturi HT Telugu

03 September 2023, 11:40 IST

google News
  • Delhi crime news : ఓ 14ఏళ్ల బాలుడు.. తన టీచర్​ను చంపిన ఘటన దిల్లీలో వెలుగులోకి వచ్చింది. టీచర్​ చేస్తున్న లైంగిక దాడిని తట్టుకోలేకే.. బాలుడు అతడిని చంపేశాడు.

తనపై లైంగిక దాడి చేస్తున్నాడని.. టీచర్​ను కిరాతకంగా చంపిన బాలుడు!
తనపై లైంగిక దాడి చేస్తున్నాడని.. టీచర్​ను కిరాతకంగా చంపిన బాలుడు!

తనపై లైంగిక దాడి చేస్తున్నాడని.. టీచర్​ను కిరాతకంగా చంపిన బాలుడు!

Delhi crime news : దిల్లీలో మరో క్రైమ్​ వార్త వెలుగులోకి వచ్చింది. 28ఏళ్ల ట్యూషన్​ టీచర్​ని గొంతు కోసి చంపేశాడు ఓ బాలుడు. తనపై జరుగుతున్న లైంగిక దాడిని తట్టుకోలేకే హత్య చేశాడు!

ఇదీ జరిగింది.

దిల్లీలోని జామియా నగర్​లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్​ 30 మధ్యాహ్నం 2:15 గంటలకు పీసీఆర్​కు ఫోన్​కాల్​ వచ్చింది. జామియా నగర్​లోని బాట్లా హౌజ్​ రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్​లో ఓ మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెడపై కత్తి గాటు ఉండటాన్ని చూశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాధితుడి వివరాలను సేకరించారు. అతను జాకిర్​ నగర్​లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడని తెలుసుకున్నారు. అయితే అతను ఒక హోమోసెక్ష్యువల్​ అని, రెండు నెలలుగా ఓ 14ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసుల ప్రాథమిక దర్యప్తులో తేలింది.

ఇదీ చూడండి:- Delhi crime news : దిల్లీలో దారుణం.. 85ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

minor kills teacher in Delhi : నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. చివరికి శుక్రవారం నాడు ఆ 14ఏళ్ల బాలుడిని అరెస్ట్​ చేశారు. రెండు నెలలుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే కారణంతోనే పదునైన ఆయుధంతో హత్య చేసినట్టు బాలుడు అధికారులకు వెల్లడించాడు.

"రెండు నెలల ముందు నేను అతడిని తొలిసారి కలిశాను. నాపై లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. మళ్లీ మళ్లీ రమ్మని పిలిచేవాడు. రాకపోతే.. వీడియోను సోషల్​ మీడియాలో పెట్టి వైరల్​ చేస్తానని బెదిరించేవాడు. ఆగస్ట్​ 30న కూడా నన్ను రమ్మని ఫోన్​ చేశాడు. నేను ఇక సహించలేకపోయాను," అని బాలుడు.. పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

14 year old boy kills teacher : మరోవైపు.. ఘటన జరిగిన ఫ్లాట్​, బాధితుడి కుటుంబానికి చెందినది అని తెలిస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు అది రెంట్​కి ఉండేదని, కొన్ని రోజుల క్రితమే అది ఖాళీ అయ్యిందని సమాచారం. ఖాళీ అయిన వెంటనే.. ఆ ట్యూషన్​ టీచర్​.. బాలుడిని పిలిపించాడు. చివరికి బాలుడు అతడిని చంపేశాడు.

తదుపరి వ్యాసం