UP crime news : యూపీలో బాలిక కిడ్నాప్.. నెలన్నర పాటు రేప్!
29 August 2023, 9:17 IST
- UP crime news : బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి.. నెలన్నరపాటు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చివరికి.. పోలీసులు బాధితురాలిని రక్షించారు.
యూపీలో బాలిక కిడ్నాప్.. నెలన్నర పాటు రేప్!
UP crime news : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 15ఏళ్ల మైనర్‌ను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి.. ఆమెను నెలన్నర పాటు రేప్ చేశాడు!
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ బాలియా ప్రాంతంలోని కోట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు జులై 9న అదృశ్యమైంది. ఆమె కోసం వెతికినా, ఫలితం దక్కకపోవడంతో.. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
Minor raped in Uttar Pradesh : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్ ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి.. ఆమె డియోరియా ప్రాంతంలో ఉందని తెలుసుకున్నారు. ఈ నెల 26న ఆమెను రక్షించారు. ఈ క్రమంలో, బాధితురాలు.. తనకి జరిగింది పోలీసులకు వివరించింది.
"బిహార్‌కు చెందిన రాహుల్ కుమార్ సింగ్ (19).. నన్ను కిడ్నాప్ చేశాడు. డియోరియాలో పెట్టాడు. నెలన్నర పాటు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు," అని బాలిక స్టేట్మెంట్ ఇచ్చింది.
UP minor raped for a month : బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే అతడిని అరెస్ట్ చేశారు.
రేప్ కేసులో నిందితుడికి 15ఏళ్ల జైలు శిక్ష..
మిస్డ్ కాల్ ద్వారా కలిసిన ఓ మహిళను రేప్ చేసిన వ్యక్తికి.. 15ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది ఝార్ఖండ్ కోర్టు. 2021లో ఈ ఘటన జరిగింది.
2021లో మహిళ.. పొరపాటను నిందితుడికి కాల్ చేసింది. మిస్డ్ కాల్ అని చెప్పి, పెట్టేసినప్పటికీ.. ఆ వ్యక్తి, ఆమె నెంబర్ సేవ్ చేసుకున్నాడు. తరచూ కాల్ చేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత.. వీరిద్దరు ఝార్ఖండ్ బొకారోలోని ఓ హోటల్లో కలిశారు. అప్పుడే.. ఫుడ్‌లో డ్రగ్స్ కలిపి ఆమెకు ఇచ్చాడు నిందితుడు. అనంతరం ఆమెను రేప్ చేసి, ఆ దృశ్యాలను వీడియో తీశాడు. వాటిని అడ్డం పెట్టుకుని, తనను భౌతికంగా కలవాలని 23ఏళ్ల మహిళను ఒత్తిడి చేసేవాడు. చివరికి.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. తాజాగా.. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఝార్ఖండ్ బొకారా జిల్లా కోర్టు.. అతనికి 15ఏళ్ల జైలు శిక్షాను విధించింది. రూ.25వైల జరిమానా కూడా వేసింది.