తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet-ug Results 2024: సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీఏ

CUET-UG Results 2024: సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీఏ

HT Telugu Desk HT Telugu

25 July 2024, 19:22 IST

google News
  • CUET-UG Results 2024: సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. సీయూఈటీ యూజీ ఫలితాల విడుదల ఆలస్యం కావడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, త్వరలో రిజల్ట్స్ ను ప్రకటిస్తామని ఎన్టీఏ వెల్లడించింది.

సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీఏ
సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీఏ

సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీఏ

CUET-UG Results 2024: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET-UG) ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. సీయూఈటీ యూజీ ఫలితాలను త్వరలో అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తామని తెలిపింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/CUET-UG లో ఫైనల్ ఆన్సర్ కీని పరిశీలించవచ్చు. నీట్-యూజీ, యూజీసీ-నెట్ సహా పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సీయూఈటీ-యూజీ ఫలితాల్లో జాప్యం జరుగుతోంది.

మే 15 నుంచి..

సీయూఈటీ-యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ జూలై 7న విడుదల చేసింది. ఈ నెల 19న ఏజెన్సీ ద్వారా ఫిర్యాదులు నిజమని తేలిన 1,000 మందికి పైగా అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించారు. మే 15, 16, 17, 18, 21, 22, 24, 29 తేదీల్లో సీయూఈటీ యూజీ పరీక్షను హైబ్రిడ్ విధానంలో ఎన్టీఏ నిర్వహించింది. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా సీయూఈటీ యూజీ (CUET UG) ఫలితాలను తయారు చేసి ప్రకటిస్తామని టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ సంవత్సరం, భారతదేశం వెలుపల 26 నగరాలతో సహా 379 నగరాల్లో సుమారు 13.48 లక్షల మంది విద్యార్థులు సీయూఈటీ యూజీ పరీక్ష రాశారు. ఈ ఏడాది ఆన్లైన్ విధానంలో జరిగిన పరీక్షల్లో 59 ప్రశ్నలు, ఆఫ్లైన్ పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీలో 404 ప్రశ్నలను తొలగించారు.

కటాఫ్ మార్కులు లేవు..

సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ప్రక్రియ లేనందున కటాఫ్ మార్కులను ప్రచురించబోమని ఎన్టీఏ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం సీయూఈటీ యూజీ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU) తన యూజీ తరగతులను ఆగస్టు 16 కు వాయిదా వేసే అవకాశం ఉంది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల మొదటి సెమిస్టర్ క్లాస్ లను ఆలస్యంగా ప్రారంభించనుంది.

తదుపరి వ్యాసం