CTET answer key 2024: సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2024 విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..-ctet answer key 2024 released steps to download from ctetnicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ctet Answer Key 2024: సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2024 విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

CTET answer key 2024: సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2024 విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

CTET answer key 2024: సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని సీబీఎస్ఈ బుధవారం విడుదల చేసింది. ఈ టెస్ట్ రాసిన అభ్యర్థులు ఆన్సర్ కీ ని అధికారిక వెబ్ సైట్ ctet.nic.in లో చెక్ చేసుకోవచ్చు. సీటెట్ ను సీబీఎస్ఈ జూలై 7వ తేదీన నిర్వహించింది.

సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2024 విడుదల

CTET answer key 2024: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ప్రొవిజనల్ ఆన్సర్ కీని సీబీఎస్ఈ బుధవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ctet.nic.in నుంచి ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందుకు అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీతో అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలి. సీ టెట్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూలై 7న నిర్వహించింది.

అభ్యంతరాలు చెప్పొచ్చు..

సీబీఎస్ఈ విడుదల చేసిన ఈ సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ లోని సమాధానాలపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. ప్రతి ప్రశ్నకు నిర్ధారిత ఫీజు చెల్లించి అభ్యర్థులు సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని సవాలు చేయవచ్చు. సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం నిపుణుల బృందం ఆ అభ్యంతరాలను పరిశీలిస్తుంది. ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు దొర్లితే విధానపరమైన నిర్ణయం తీసుకుని ఫీజు రీఫండ్ చేస్తారు. అనంతరం, CTET పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని సీబీఎస్ఈ (CBSE) విడుదల చేసి, ఆ తరువాత ఫలితాలను ప్రకటిస్తుంది.

జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత

దేశవ్యాప్తంగా 136 నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో జూలై 7న జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరిగింది. సీటెట్ జూలై పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 2, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పేపర్ 1 రెండు షిఫ్టుల్లో జరిగింది.

సీటెట్ జూలై ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

  1. అధికారిక వెబ్ సైట్ ctet.nic.in ను ఓపెన్ చేయాలి.
  2. హోం పేజీలో కనిపిస్తున్న సీటెట్ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయండి.
  3. మీ రోల్ నెంబరు మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
  4. స్క్రీన్ పై సీ టెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ కనిపిస్తుంది.
  5. సీ టెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోండి.

ఒక్కో ప్రశ్నకు రూ. 1000

ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.1,000 ఫీజు చెల్లించాలి. ఫీజు రీఫండ్ చేయబడదు. అలాగే, ఫీజు చెల్లించని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. ఒకవేళ, అభ్యర్థులు వ్యక్తం చేసిన అభ్యంతరం సరైనదని తేలితే, ఈ ఫీజును రీఫండ్ చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.