JNU PG Admissions 2024 : జేఎన్‌యూ పీజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..
JNU PG admission 2024 application form : జేఎన్‌యూ తన అధికారిక వెబ్సైట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎలా రిజిస్ట్ర్ చేసుకోవాలి? అర్హత వివరాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
JNU PG Admissions 2024 registration : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల రిజిస్ట్రేషన్లు 2024 మే 1న ప్రారంభమయ్యాయి. ఔత్సాహిక అభ్యర్థులు మే 27, 2024 లోగా.. jnuee.jnu.ac.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి తమకు నచ్చిన కోర్సు కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎమ్మెస్సీ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) వంటి వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులను.. వారి సీయూఈటీ పీజీ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
జేఎన్‌యూ పీజీ రిజిస్ట్రేషన్‌ని ఇలా చేసుకోండి..
- స్టెప్ 1:- jnuee.jnu.ac.in లోని జేఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
2. స్టెప్ 2:- అడిగిన వివరాలను ఎంటర్ చేసి ఇచ్చిన స్పేస్‌లో రిజిస్టర్ చేసుకోండి.
JNU PG Registration : 3. స్టెప్ 3:- అప్లికేషన్ ఫామ్ నింపండి.
4. స్టెప్ 4:- మీ ఫోటో, సంతకం స్కాన్ చేసిన కాపీలను నిర్ణీత పరిమాణంలో అప్లోడ్ చేయండి.
5. స్టెప్ 5:- అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
6. స్టెప్ 5:- తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
ఇదీ చూడండి:- CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
అర్హత ప్రమాణాలు:
జేఎన్‌యూ పీజీ రిజిస్ట్రేషన్ 2024 అర్హత వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
JNU PG admission : 1. ఎంఏ: ఎంఏ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. యూజీసీ లేదా యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10+2+3 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీయూఈటీ పీజీ స్కోర్ ఉండాలి.
2. ఎమ్మెస్సీ: ఎమ్మెస్సీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి సీయూఈటీ పీజీ స్కోర్‌తో పాటు ఏదైనా స్పెషలైజేషన్‌లో 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
JNU PG 2024 : 3. ఎంసీఏ కోర్సుకు కనీసం 55 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీసీఏ/ బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో 10+2 స్థాయిలో మ్యాథ్స్ లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీఎస్సీ/ బీకాం/ బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్లు..
CSIR UGC NET : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ.. 2024 మే 1న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ csirnet.nta.ac.in వద్ద డైరెక్ట్ లింక్‌ను చూడవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం