CUET UG Admit Card 2023 : సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల..
19 May 2023, 11:54 IST
- CUET UG Admit Card 2023 : సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. డౌన్లోడ్ లింక్‌తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డు విడుదల..
CUET UG Admit Card 2023 : 2023 సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ). ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను cuet.samarth.ac.in లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ తాజాగా విడుదల చేసింది. అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకునేందుకు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేసుకోండి.
సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
స్టెప్ 1:- సీయూఈటీ యూజీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- హోం పేజ్‌లో ఉన్న సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డ్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
CUET UG Admit Card download : స్టెప్ 3:- మీ లాగిన్ వివరాలు ఇచ్చి.. సబ్మీట్ బటన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4:- మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 5:- మీ అడ్మిట్ కార్డును చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి.
ఇదీ చూడండి:- CUET-UG: సీయూఈటీ యూజీ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు
సంబంధిత పరీక్షల వివరాలు అడ్మిట్ కార్డులో ఉంటాయి. ఇతర తేదీల్లో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కొన్ని రోజుల తర్వాత విడుదల చేయనుంది ఎన్టీఏ.
దూరంగా పరీక్షా కేంద్రాలు..!
CUET UG Admit Card 2023 release : సీయూఈటీ యూజీ పరీక్షల తీరుపై అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొన్నట్టు కనిపిస్తోంది! ఇందుకు పరీక్షా కేంద్రాల కేటాయింపులే కారణం. ఉదాహరణకు.. ముంబైలో నివాసముంటున్న అభ్యర్థులకు.. అక్కడి నుంచి 200-400 కి.మీల దూరంలోని పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నారు అధికారులు. పైగా.. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వకూడదని హెచ్చరికలు ఇస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముంబై వంటి ప్రాంతాల్లో నివాసముంటూ.. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే, ట్రాఫిక్కే సగం సమయం అయిపోతుందని తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఎన్టీఏ అధికారులు స్పందించలేదు.