UGC NET June 2023 : యూజీసీ నెట్ 2023 జూన్ సెషన్ అప్లికేషన్లు ప్రారంభం: ముఖ్యమైన తేదీ, దరఖాస్తు ప్రాసెస్ వివరాలివే
UGC NET June 2023: యూజీసీ నెట్ జూన్ 2023 అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలివే..
UGC NET June 2023 : యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (NET) 2023 జూన్ సెషన్ పరీక్ష కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ యూజీసీ నెట్ జూన్ 2023 పరీక్షకు అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. మే 31వ తేదీ అప్లికేషన్లకు ఆఖరు తేదీగా ఉంది. అర్హులైన అభ్యర్థులు యూజీసీ నెట్ జూన్ 2023 పరీక్షకు అధికారిక వెబ్‍సైట్ ugcnet.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. యూజీసీ నెట్ 2023 జూన్ సెషన్ ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రాసెస్ సహా మిగిలిన వివరాలు ఇక్కడ చూడండి.
UGC NET June 2023 : యూజీసీ నెట్ జూన్ 2023 సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు మే 31వ తేదీ (సాయంత్రం 5 గంటలు) తుది గడువుగా ఉంది. దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు జూన్ 2 నుంచి 3వ తేదీ వరకు కరెక్షన్ విండో గడువు ఉంటుంది.
UGC NET June 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ మొదటి వారంలో సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‍లు, అడ్మిట్ కార్డులు విడుదవుతాయి. జూన్ 13వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య యూజీసీ నెట్ జూన్ 2023 పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు, షిప్ట్ టైమింగ్‍లను అడ్మిట్ కార్డుల్లో ఎన్‍టీఏ వెల్లడిస్తుంది.
UGC NET June 2023 : యూజీసీ నెట్ దరఖాస్తు ఫీజు జనరల్/అన్‍రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు రూ.1,150గా ఉంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‍సీఎల్ అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.325గా ఉంది.
UGC NET June 2023: దరఖాస్తు ఇలా..
- ముందుగా అఫీషియల్ వెబ్‍సైట్ ugcnet.nta.nic.in లోకి వెళ్లాలి.
- హోం పేజీలో క్యాండిటేడ్ యాక్టివిటీలో UGC NET June 2023 అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్‍పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో న్యూ రిజిస్ట్రేషన్ బటన్‍పై క్లిక్ చేయండి.
- అనంతరం ఇన్‍స్ట్రక్షన్‍లను క్షుణ్ణంగా చదివి, ప్రొసీడ్ బటన్‍పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అడిగిన వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
- చివరగా పరీక్ష ఫీజు చెల్లించి.. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- అనంతరం అప్లికేషన్ డౌన్‍లోడ్ చేసుకొని, ప్రింటౌట్ తీసుకోవాలి.