CUET PG 2023 exam dates: సీయూఈటీ పీజీ పరీక్ష తేదీలు వచ్చేశాయి.. ఇవే ఆ డేట్స్..
20 April 2023, 21:41 IST
CUET PG 2023 exam dates: దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ (CUET PG) పరీక్ష తేదీలను యూజీసీ (UGC) ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
CUET PG 2023 exam dates: దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ (CUET PG) పరీక్ష తేదీలను గురువారం యూజీసీ (UGC) ప్రకటించింది. యూజీసీ (UGC) చైర్మన్ జగదీశ్ కుమార్ (Jagadesh Kumar) గురువారం ఈ పరీక్ష తేదీలను ప్రకటించారు.
CUET PG 2023 exam dates: జూన్ 5వ తేదీ నుంచి..
2023వ సంవత్సరానికి గానూ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (Common University Entrance Test CUET PG) పీజీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు జూన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో జరుగుతాయని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఇతర వివరాల కోసం విద్యార్థులు క్రమం తప్పకుండా ఎన్టీఏ (NTA) అధికారిక వెబ్ సైట్స్ http://nta.ac.in ను, అలాగే, https://cuet.nta.nic.in ను పరిశీలిస్తుండాలని ట్విటర్ లో ఆయన సూచించారు. సీయూఈటీ పీజీ (CUET PG) పరీక్షకు సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్స్ ను ఎన్టీఏ (NTA) ఆ వెబ్ సైట్స్ లో పోస్ట్ చేస్తుంటుందని వివరించారు. సీయూఈటీ పీజీ పరీక్ష (CUET PG) రెండు షిఫ్ట్ ల్లో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు , రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది.
CUET PG 2023 exam dates: మే 5 వరకు రిజిస్ట్రేషన్
విద్యార్థులు CUET PG పరీక్షలకు అప్లై చేసుకునే తేదీని ఇటీవల మే 5వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్లికేషన్ ఫామ్ లో తప్పొప్పులను సరి చేసుకునేందుకు వీలు కల్పించే కరెక్షన్ విండో (correction window) మే 6వ తేదీన ఓపెన్ అవుతుంది. ఆ విండో మే 8 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్స్ ను ఎన్ టీఏ త్వరలో అధికారిక వెబ్ సైట్స్ http://nta.ac.in ను, అలాగే, https://cuet.nta.nic.in లో అందుబాటులో ఉంచుతుంది.