CUET-UG: సీయూఈటీ యూజీ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు-nta reschedules cuet ug citing larger number of candidates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet-ug: సీయూఈటీ యూజీ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు

CUET-UG: సీయూఈటీ యూజీ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు

HT Telugu Desk HT Telugu
May 17, 2023 04:48 PM IST

CUET-UG: సీయూఈటీ యూజీ (CUET-UG) పరీక్ష తేదీల్లో ఎన్టీఏ స్వల్ప మార్పులు చేసింది. కొన్ని నగరాల్లో ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CUET-UG: వివిధ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి గానూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG) ను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ పరీక్షను గత సంవత్సరం తొలి సారి నిర్వహించగా, ఈ ఏడాది నిర్వహిస్తోన్న పరీక్ష రెండవది.

CUET-UG dates rescheduled: తేదీల్లో స్వల్ప మార్పులు

వివిధ నగరాల నుంచి ఈ పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యల దరఖాస్తు చేసుకున్నందు వల్ల CUET-UG పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఎన్టీఏ (NTA) ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షను మే 21వ తేదీ నుంచి మే 31 వరకు నిర్వహించాల్సి ఉంది. వివిధ నగరాల్లో ఈ CUET-UG పరీక్ష రాస్తున్న విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నందున ఈ CUET-UG పరీక్షను జూన్ 1, జూన్ 2, జూన్ 5, జూన్ 6 తేదీల్లో కూడా నిర్వహించనున్నారు. అలాగే, బఫర్ డేస్ గా జూన్ 7, జూన్ 8 తేదీలను రిజర్వ్ చేశారు. మరోవైపు, తమ పరీక్ష కేంద్రాల విషయంలో అసంతృప్తితో ఉన్న విద్యార్థులు ఎన్టీఏ (NTA) ను సంప్రదించవచ్చని యూజీసీ (University Grants Commission) చైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. వారు cuetug@nta.ac.in మెయిల్ఐడీ కి మెయిల్ చేసి తమ పరీక్ష కేంద్రాన్ని మార్చమని అభ్యర్థించవచ్చని తెలిపారు. కాగా, అభ్యర్థుల చిరునామాకు 100 కిమీల పరిధిలోపే పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు ఎన్టీఏ తెలిపింది. గత సంవత్సరం జరిగిన CUET-UG లో కూడా కొన్ని సాంకేతిక, పరిపాలన పరమైన లోపాలు చోటు చేసుకున్నాయి. దాంతో, కొన్ని సెంటర్లలో పరీక్షను రద్దు కూడా చేశారు.

Whats_app_banner