CUET-UG application : సీయూఈటీ యూజీ అప్లికేషన్​ గడువు పొడగింపు..-cuetug application deadline extended see full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet-ug Application : సీయూఈటీ యూజీ అప్లికేషన్​ గడువు పొడగింపు..

CUET-UG application : సీయూఈటీ యూజీ అప్లికేషన్​ గడువు పొడగింపు..

Sharath Chitturi HT Telugu
Apr 10, 2023 07:47 AM IST

CUET-UG application last date : సీయూఈటీ యూజీ అప్లికేషన్​ గడువును అధికారులు పొడగించారు. పూర్తి వివరాలు..

 సీయూఈటీ యూజీ అప్లికేషన్​ గడువు పొడగింపు.
సీయూఈటీ యూజీ అప్లికేషన్​ గడువు పొడగింపు.

CUET-UG 2023 application last date : సీయూఈటీ- యూజీ (కామెన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ ఫర్​ అండర్ ​గ్రాడ్యుయేట్స్​) అప్లికేషన్​ గడువును అధికారులు పొడగించారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు అప్లికేషన్​ పోర్టల్​ను మళ్లీ తెరిచారు సంబంధిత అధికారులు. అభ్యర్థులు మంగళవారం (2023 ఏప్రిల్​ 11) రాత్రి 11:59 గంటల వరకు అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవచ్చు.

"అనేక మంది విద్యార్థుల అభ్యర్థన మేరకు సీయూఈటీ- యూజీ అప్లికేషన్​ పోర్టల్​ను తిరిగి తెరవాలని మేము నిర్ణయించుకున్నాము. ఆది, సోమ, మంగళవారాలు ఈ పోర్టల్​ అందుబాటులో ఉంటుంది. cuet.samarth.ac.in లో మరింత సమాచారం తెలుసుకోవాలని విద్యార్థులను సూచిస్తున్నాము," అని యూజీసీ ఛైర్మన్​ జగదీశ్​ కుమార్​ ఓ ప్రకటన విడుదల చేశారు.

CUET-UG 2023 application deadline extended : ఇప్పటివరకు 14లక్షల మంది విద్యార్థులు ఈ దఫా సీయూఈటీ యూజీ పరీక్షకు అప్లై చేసుకున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఇప్పటికే ఇది 41శాతం పెరిగినట్టు. ఇక ఈ మూడు రోజుల తర్వాత.. అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతుందని యూజీసీ భావిస్తోంది.

మే 21- 31 మధ్యలో ఈ సీయూఈటీ యూజీ పరీక్షలు జరుగుతాయి. వాస్తవానికి అప్లికేషన్​ తుది గడువు 2023 మార్చ్​ 30తో ముగిసింది. కాగా.. ఈసారి మూడు షిఫ్ట్​లలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

సిలబస్​లో మార్పులు లేవు..

CUET-UG application latest news : ఎన్​సీఈఆర్​టీ పుస్తకాల హేతుబద్ధీకరణతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష సిలబస్​ మారిందా? అని ఆయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంపై ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) అధికారి ఒకరు స్పందించారు.

"గతంలో నోటిఫై చేసిన సిలబస్​ ప్రకారమే పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష కేవలం ఒక్క బోర్డుకు సంబంధించినది కాదు కదా! అందుకే ఎలాంటి మార్పులు ఉండవు," అని ఎన్​టీఏ అధికారి స్పష్టం చేశారు.

CUET-UG exam schedule details in telugu : అప్లికేషన్ల పరంగా చూసుకుంటే.. దేశంలోనే రెండో అతిపెద్ద ఎంట్రెన్స్​ ఎగ్జామ్​గా నిలుస్తుంది ఈ సీయూఈటీ యూజీ. 2022లో తొలిసారి ఈ పరీక్షను నిర్వహించగా.. 12.50లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. 9.9లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద ఎంట్రెన్స్​ ఎగ్జామ్​గా నీట్​ యూజీ కొనసాగుతోంది. ఈ పరీక్షకు సగటున 18లక్షల రిజిస్ట్రేషన్లు వస్తుంటాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం