CBSE new syllabus : సీబీఎస్​ఈ సిలబస్​లో భారీ మార్పులు.. మొఘల్స్​తో పాటు ఇక ఆ పాఠాలు ఔట్​!-mughals history is now out of syllabus for class 12 cbse and up board students ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse New Syllabus : సీబీఎస్​ఈ సిలబస్​లో భారీ మార్పులు.. మొఘల్స్​తో పాటు ఇక ఆ పాఠాలు ఔట్​!

CBSE new syllabus : సీబీఎస్​ఈ సిలబస్​లో భారీ మార్పులు.. మొఘల్స్​తో పాటు ఇక ఆ పాఠాలు ఔట్​!

Sharath Chitturi HT Telugu
Apr 04, 2023 07:19 AM IST

CBSE new syllabus class 12 : హిస్టరీ, పొలిటికల్​ సైన్స్​లోని పలు కీలక పాఠాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్​సీఈఆర్​టీ. ఫలితంగా.. మొఘల్స్​ వంటి పాఠాలు ఇక సీబీఎస్​ఈ క్లాస్​ 12 పుస్తకాల్లో కనిపించవు.

సీబీఎస్​ఈ క్లాస్​ 12 సిలబస్​ నుంచి మొఘల్స్​ ఔట్​.. ఇకపై ఆ పాఠాలు ఉండవు!
సీబీఎస్​ఈ క్లాస్​ 12 సిలబస్​ నుంచి మొఘల్స్​ ఔట్​.. ఇకపై ఆ పాఠాలు ఉండవు!

CBSE new syllabus class 12 : మొఘల్​ చక్రవర్తుల చరిత్రకు సంబంధించిన పాఠాలు ఇక సీబీఎస్​ఈ క్లాస్​ 12, యూపీ బోర్డు సిలబస్​లలో కనిపించవు! ఈ మేరకు.. హిస్టరీ కర్రికులమ్​ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర- రాష్ట్ర విద్యా సంస్థల అడ్వైజరీ ఎన్​సీఈఆర్​టీ.

ఈ పాఠాలు కట్​..!

ఎన్​సీఈఆర్​టీ తాజా నిర్ణయంతో 'కింగ్స్​ అండ్​ క్రానికల్స్​', 'ది మొఘల్​ కోర్ట్​' వంటి ఛాప్టర్​లు ఇకపై సీబీఎస్​ఈ క్లాస్​ 12 మెడీవియల్​ హిస్టరీ టెక్స్​ బుక్స్​లో ఉండవు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఓ ఉన్నతాధికారి వివరించారు.

CBSE new syllabus 2023- 2024 : మరోవైపు.. ఎన్​సీఈఆర్​టీ క్లాస్​ 12 హిస్టరీ టెక్స్ట్​బుక్స్​ను ఫాలో అవ్వాలని ఉత్తర్​ ప్రదేశ్​ ఎడ్జ్యుకేషన్​ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో.. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొఘల్స్​ చరిత్రకు సంబంధించిన పాఠాలు ఉండవు.

"మా విద్యార్థులకు ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలు చూసి చదువు చెబుతాము. అందులో ఏముంటే అదే చెప్పాలి కదా," అని ఉత్తర్​ ప్రదేశ్​ డిప్యూటీ సీఎం బ్రజేష్​ పాఠక్​ మీడియాకు వివరించారు.

పొలిటికల్​ సైన్స్​ పాఠాల్లో కూడా మార్పులు..

CBSE class 12 syllabus news today : మరోవైపు సీబీఎస్​ఈ క్లాస్​ 12 పొలిటికల్​ సైన్స్​ సిలబస్​లో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో సోషలిస్ట్​, కమ్యూనిస్ట్​ పార్టీలకు సంబంధించిన 'రైజ్​ ఆఫ్​ పాప్యులర్​ మూమెంట్స్​', స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్​ పాలనకు చెందిన 'ఎరా ఆఫ్​ వన్​ పార్టీ డామినెన్స్​' వంటి ఛాప్టర్​లను తొలగించారు.

క్లాస్​ 10, 11 సిలబస్​లలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 'డెమొక్రసీ అండ్​ డైవర్సిటీ', 'పాప్యులర్​ స్ట్రగుల్స్​ అండ్​ మూవ్​మెంట్స్​' వంటి పాఠాలను క్లాస్​ 10 పొలిటికల్​ సైన్స్​ సిలబస్​ నుంచి తప్పించారు. 'సెంట్రల్​ ఇస్లామిక్​ ల్యాండ్స్​', 'కాన్​ఫ్రెంట్రేషన్​ ఆఫ్​ కల్చర్స్​' వంటి పాఠాలను సీబీఎస్​ఈ క్లాస్​ 11 హిస్టరీ పుస్తకాల నుంచి తొలగించారు.

CBSE syllabus latest news : సిలబస్​లో చోటుచేసుకున్న మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని ఎన్​సీఈఆర్​టీకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం