NEET UG 2023: నీట్ యూజీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఇవే ఇంపార్టెంట్ డేట్స్..-neet ug 2023 registration important dates application begins how to do other details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Neet Ug 2023 Registration: Important Dates, Application Begins, How To Do, Other Details

NEET UG 2023: నీట్ యూజీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఇవే ఇంపార్టెంట్ డేట్స్..

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 10:10 PM IST

NEET UG 2023: వైద్య విద్యకుసంబంధించిన కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నీట్ యూజీ 2023 (NEET UG 2023)’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ లను మార్చి 6వ తేదీ నుంచి సబ్మిట్ చేయవచ్చు. ఈ పరీక్షను తెలుగు, ఉర్దూ సహా13 భాషల్లో నిర్వహించనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

NEET UG 2023: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నీట్ యూజీ 2023 (NEET UG 2023)’ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ తదితర యూజీ కోర్సుల్లోప్రవేశానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అవసరం.

ట్రెండింగ్ వార్తలు

NEET UG 2023: నీట్ యూజీకి సంబంధించిన కీలక వివరాలు..

  • నీట్ యూజీ 2023 (NEET UG 2023) ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ సహా 13 భాషల్లో నిర్వహిస్తారు.
  • నీట్ యూజీ 2023 (NEET UG 2023) పరీక్షకు https://neet.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
  • ఈ NEET UG 2023 పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల నుంచి, ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
  • NEET UG 2023 పరీక్ష 3 గంటల 20 నిమిషాలు (200 నిమిషాలు) ఉంటుంది. అంటే, ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం సమయం ఉంటుంది. నీట్ యూజీ 2023 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నిర్వహిస్తారు.
  • నీట్ యూజీ 2023 (NEET UG 2023) దరఖాస్తులను ఆన్ లైన్ లో సబ్మిట్ చేయాలి. ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ లను మార్చి 6 వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వ తేదీ రాత్రి 9 గంటల వరకు సబ్మిట్ చేయవచ్చు.
  • ఒక విద్యార్థి ఒక అప్లికేషన్ ను మాత్రమే సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ లో ఎంటర్ చేసిన ఈ మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ యాక్టివ్ గా ఉండాలి.
  • అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్ ల్లో ఒక దానిని అప్ లోడ్ చేయాలి.
  • NEET UG 2023 అప్లికేషన్ ఫీజును కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు (Credit Card), డెబిట్ కార్డు (Debit Card), నెట్ బ్యాంకింగ్ (Net-Banking), యూపీఐ (UPI) విధానాల ద్వారా ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఫీజును చెల్లించవచ్చు.
  • NEET UG 2023 ఎగ్జామ్ కు సంబంధించిన ఇతర వివరాలను తరువాత ప్రకటిస్తారు. వివరాల కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ www.nta.ac.in, లేదా https://neet.nta.nic.in/ లను సందర్శించాలి.
  • NEET UG 2023 అడ్మిట్ కార్డ్ ను www.nta.ac.in, లేదా https://neet.nta.nic.in/ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

WhatsApp channel