తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Ug 2024 : సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CUET UG 2024 : సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

07 July 2024, 13:05 IST

google News
    • CUET UG 2024 Answer key : సీయూఈటీ యూజీ 2024 ఆన్సర్ కీ విడుదలైంది. అబ్జెక్షన్ విండో ఈ రోజు తెరిచి జూలై 9, 2024 న ముగుస్తుంది.
సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీ విడుదల
సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీ విడుదల

సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జులై 7, 2024 న సీయూఈటీ యూజీ 2024 ఆన్సర్ కీని విడుదల చేసింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (యూజీ)- 2024కు హాజరైన అభ్యర్థులు ప్రొవిజనల్ ఆన్సర్ కీలు, ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేసిన చిత్రాలను exams.nta.ac.in వద్ద సీయూఈటీ అధికారిక వెబ్​సైట్​లో చెక్ చేసుకోవచ్చు.

ఆన్సర్ కీ అబ్జెక్షన్ విండో జూలై 7న ప్రారంభమై 2024 జూలై 9న ముగుస్తుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు జూలై 9, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో సమాధానానికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ.200/- నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం ద్వారా ఓఎంఆర్ గ్రేడింగ్​కు వ్యతిరేకంగా వినతిపత్రం సమర్పించవచ్చు.

ప్రాసెసింగ్ ఫీజును డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా జూలై 9, 2024 వరకు చెల్లించవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుండా ఎలాంటి ఛాలెంజ్​ను స్వీకరించరు.

ఆన్సర్​ కీని ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- exams.nta.ac.in వెళ్లండి.

స్టెప్​ 2:- కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ) పేజీపై క్లిక్ చేయండి.

స్టెప్​ 3:- ఆన్సర్ కీ డౌన్​లోడ్​ పేజీకి వెళ్లాలి.

స్టెప్​ 4:- దీని కోసం ఇచ్చిన ఖాళీలపై మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.

స్టెప్​ 5:- సబ్మిట్ చేసి ఆన్సర్ కీ చెక్ చేసుకోవాలి.

స్టెప్​ 6:- అనంతరం దానిని డౌన్​లోడ్​ చేసి పెట్టుకోండి.

ఇదీ చూడండి:- NEET UG 2024 Counseling : నీట్​ యూజీ కౌన్సిలింగ్​ వాయిదా.. కారణం ఇదే!

సీయూఈటీ యూజీ 2024 ఆన్సర్ కీ: అభ్యంతరాలు ఎలా లేవనెత్తాలి?

ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలంటే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

  • exams.nta.ac.in వద్ద సీయూఈటీ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీయూఈటీ యూజీ 2024 ఆన్సర్ కీ అభ్యంతర విండో లింక్​పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • మీ ఆన్సర్ కీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
  • ఆన్సర్ కీని చెక్ చేసి, మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటున్న ప్రశ్నపై క్లిక్ చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్​లోడ్ చేయాలి.
  • సబ్మిట్​పై క్లిక్ చేసి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్​పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
  • ఛాలెంజ్ తర్వాత నిపుణులు ఖరారు చేసే సమాధానం ఫైనల్ అవుతుంది.

ఒకవేళ మీరు మీ OMR/రికార్డ్ చేసిన ఆన్సర్స్​ వీక్షించలేకపోతే, మీరు మీ ఫిర్యాదులను మీ అప్లికేషన్ నెంబరు, అభ్యర్థి పేరు, కోడ్​తో rescuetug@nta.ac.in ఈమెయిల్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీయూఈటీ అధికారిక వెబ్​సైట్​ చూడవచ్చు. అక్కడ మరిన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి.

తదుపరి వ్యాసం