NEET UG 2024 Counseling : నీట్​ యూజీ కౌన్సిలింగ్​ వాయిదా.. కారణం ఇదే!-neet ug 2024 counseling delayed amid paper leak row new date awaited ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2024 Counseling : నీట్​ యూజీ కౌన్సిలింగ్​ వాయిదా.. కారణం ఇదే!

NEET UG 2024 Counseling : నీట్​ యూజీ కౌన్సిలింగ్​ వాయిదా.. కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu
Jul 06, 2024 01:01 PM IST

NEET UG 2024 : పేపర్ లీక్​​ వివాదం కారణంగా నీట్-యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా పడింది. కౌన్సిలింగ్​ డేట్​ని ప్రకటించలేదు. పూర్త వివరాలు..

పేపర్​ లీక్​కి వ్యతిరేకంగా నిరసనలు..
పేపర్​ లీక్​కి వ్యతిరేకంగా నిరసనలు.. (Hindustan Times)

పేపర్ లీక్​ వివాదం నేపథ్యంలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారులు తాజాగా వెల్లడించారు.

కౌన్సిలింగ్​ ఎప్పుడు జరుగుతుంది? అన్న వివరాలను ప్రకటించలేదు. కానీ తదుపరి ప్రకటన వెలువడేంత వరకు నీట్​ యూజీ కౌన్సిలింగ్​ని వాయిదా వేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

2024 జూలై 6 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. కాన నీట్-యూజీ కౌన్సెలింగ్ 2024కు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్, షెడ్యూల్​ని ఎంసీసీ వెల్లడించలేదు. కౌన్సిలింగ్​కి సంబంధించి నేడు ఒక అప్డేట్​ వస్తుందని అందరు భావించారు. కానీ నీట్​ యూజీ కౌన్సిలింగ్​ వాయిదా పడిందని అప్డేట్​ వచ్చింది.

ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించే పరీక్ష ఈ నీట్​. ఈ ఏడాది ఈ నీట్​ చుట్టూ తీవ్రస్థాయిలో వివాదం నెలకొంది. మే 5న పరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఫలితాలు వెలువడిన తర్వాతి వరకు పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తొలుత నీట్​ యూజీ 2024పై పేపర్​ లీక్​ ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం జూన్ 14న విడుదల అవ్వాల్సిన ఫలితాలు జూన్​ 4న బయటకు రావడందో, అందులో ఎన్టీఏ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హరియాణాలోని ఫరీదాబాద్​లో ఒక కేంద్రానికి చెందిన ఆరుగురు ఈ జాబితాలో ఉండటం అక్రమాలపై అనుమానాలను రేకెత్తించింది. నీట్-యూజీలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులను తిరిగి పరీక్ష రాయాలని ఎన్టీఏ చెప్పింది. అయితే వారిలో 750 మంది గైర్హాజరయ్యారు.

పేపర్ లీక్​ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించగా, ప్రధాన సూత్రధారి అమన్ సింగ్ సహా ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది.

మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్-యూజీ 2024ను తిరిగి నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇలాంటి చర్య అకడమిక్ క్యాలెండర్​కు విఘాతం కలిగిస్తుందని, అవకతవకలకు విస్తృత ఆధారాలు లేనందున అనవసరమని వాదించింది.

ఈ అభిప్రాయాన్ని సమర్ధిస్తూ ఎన్టీఏ కూడా అదే రోజు సుప్రీంకోర్టులో వేర్వేరుగా అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షను రద్దు చేయడం ప్రతికూలమని, ప్రతిభావంతులైన విద్యార్థుల కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తుందని, అవకతవకలు "చిన్నవి", "అడపాదడపా" , “చెల్లాచెదురు” ఘటనలను, నేరాని పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

నీట్​ యూజీ 2024 అనంతరం నీట్​ పీజీ 2024 వాయిదా పడింది. ఆగస్ట్​లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

మరోవైపు నీట్​ యూజీ 2024 చుట్టూ రాజకీయ దుమారం కూడా నెలకొంది. ప్రభుత్వాన్ని టార్గెట్​ చేస్తూ విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం