తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ctet Answer Key : త్వరలో సీటెట్​ 2024 ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CTET Answer Key : త్వరలో సీటెట్​ 2024 ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

13 July 2024, 8:50 IST

google News
  • CTET July 2024 Answer Key : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ 2024) జూలై ఎడిషన్​కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనుంది. ఆ వివరాలు..

త్వరలో సీటెట్​ జులై 2024 పరీక్ష ఆన్సర్​ కీ..
త్వరలో సీటెట్​ జులై 2024 పరీక్ష ఆన్సర్​ కీ..

త్వరలో సీటెట్​ జులై 2024 పరీక్ష ఆన్సర్​ కీ..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ 2024) జూలై ఎడిషన్​కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని త్వరలో, తన అధికారిక వెబ్​సైట్​ (ctet.nic.in)లో విడుదల చేయనుంది. సీటెట్ అధికారిక ఆన్సర్ కీ 2024ను సీబీఎస్ఈ జూలై 25న విడుదల చేయనుందని సమాచారం. అయితే ఆన్సర్ కీ విడుదల తేదీ, సమయంపై బోర్డు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సీబీఎస్ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ (డీఓబీ) వంటి లాగిన్ వివరాలను ఉపయోగించి పేపర్ 1, పేపర్ 2 కోసం సీటెట్​ ఆన్సర్ కీ 2024 పీడీఎఫ్​ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

సీటెట్ జూలై 2024 నోటిఫికేషన్ ప్రకారం, 2024 ఆగస్టు చివరి నాటికి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

సీటెట్ ఆన్సర్ కీ 2024: ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఇలా చెక్​ చేసుకోండి..

  • స్టెప్​ 1:- ctet.nic.in సీబీఎస్ఈ సీటెట్​ అధికారిక వెబ్​సైట్​కి వెళ్లండి.
  • స్టెప్​ 2:- హోమ్ పేజీలో లభ్యమయ్యే సీటెట్ ఆన్సర్ కీ 2024 లింక్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 3:- రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి.
  • స్టెప్​ 4:- సబ్మీట్​ బటన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 5:- ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆన్సర్ కీ మీ స్క్రీన్​పై డిస్​ప్లే అవుతుంది.
  • స్టెప్​ 6:- సమాధానాలను జాగ్రత్తగా చదవండి.
  • స్టెప్​ 7:- సీటెట్ ఆన్సర్ కీ పీడీఎఫ్​ను డౌన్​లోడ్ చేసుకోండి.

సీబీఎస్ఈ సీటెట్ జూలై 2024: మార్కింగ్ స్కీమ్

నోటిఫికేషన్ ప్రకారం పేపర్ 1, పేపర్ 2లోని ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది. అయితే, తప్పు సమాధానాలకు కటింగ్​ ఉండదు. అంటే సీటెట్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండదు.

సీటెట్ ఆన్సర్ కీ 2024: అర్హత..

ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం సీటెట్ పరీక్షలో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వ్యక్తిని టెట్ ఉత్తీర్ణతగా పరిగణిస్తారు.

సీటెట్ ఆన్సర్ కీ 2024: రీ-చెకింగ్/ రీవాల్యుయేషన్

సీబీఎస్ఈ నోటిఫికేషన్ ప్రకారం ఫలితాల పునః మూల్యాంకనం/పునఃపరిశీలన ఉండదు.

సీటెట్ ఆన్సర్ కీ 2024: సర్టిఫికేట్ చెల్లుబాటు వ్యవధి..

నియామకం కోసం సీటెట్​ అర్హత సర్టిఫికేట్ చెల్లుబాటు వ్యవధి అన్ని కేటగిరీలకు జీవితకాలం ఉంటుంది. ఒక వ్యక్తి సీటెట్​ సర్టిఫికేట్ పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేయవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదు. అయితే, సీటెట్​కు అర్హత సాధించిన వ్యక్తి తన స్కోరును మెరుగుపరుచుకోవడానికి మళ్లీ ప్రయత్నించవచ్చు.

కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు (కేవీఎస్, ఎన్వీఎస్, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ మొదలైనవి), చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దిల్లీలోని ఎన్సీటీ పరిపాలనా నియంత్రణలో ఉన్న పాఠశాలలకు సీటెట్ వర్తిస్తుంది. సీటెట్​ని పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని ఉపయోగించే అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఇది వర్తించవచ్చు.

సీటెట్ 2024 పరీక్షను 2024 జూలై 7న 2:30 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-1 పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) సెక్షన్ 2లోని క్లాజ్ (ఎన్)లో పేర్కొన్న ఏ పాఠశాలలోనైనా ఉపాధ్యాయ నియామకానికి అభ్యర్థులు అర్హత సాధించాలంటే సీటెట్ పరీక్ష తప్పనిసరి.

చివరి సీఈటీఈ పరీక్ష (18వ ఎడిషన్) జనవరి 21న దేశవ్యాప్తంగా 135 నగరాల్లోని 3,418 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. సీటెట్ జనవరి పరీక్ష రెండు పేపర్లకు 26,93,526 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని, 84 శాతం హాజరు నమోదైందని సీబీఎస్ఈ తెలిపింది.

తదుపరి వ్యాసం