తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Serial Killer : భార్యతో సహా 42 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్

Serial Killer : భార్యతో సహా 42 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్

Anand Sai HT Telugu

21 July 2024, 14:14 IST

google News
    • Crime News In Telugu : ఓ వ్యక్తి 42 మంది మహిళలను హత్య చేశాడు. అందులో అతడి భార్య కూడా ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (image source from unsplash.com)

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి మహిళలపై కోపం పెంచుకున్నాడు. 42 మంది మహిళలను హత్య చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అయ్యారు. తమ పక్కనే ఉంటున్న వ్యక్తి ఇలా చేస్తుండటం తెలిసి.. స్థానికులు ఒక్కసారిగా భయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. కెన్యాలో కాలిన్స్ జుమైసీ ఖలుషా అనే 33 ఏళ్ల వ్యక్తి తన భార్యతో సహా 42 మంది మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ షాకింగ్ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

నైరోబీలోని ముకురు మురికివాడలలోని ఒక పాడుబడిన క్వారీలో తొమ్మిది మంది స్త్రీల ఛిద్రమైన మృతదేహాలు దొరికాయి. తర్వాత సమీపంలోనే అనుమానస్పదంగా ఉన్న వ్యక్తి గురించి తెలిసింది. అతడి ఇంటిలో జరిపిన పరిశీలనలో అసలు నిజాలు బయటపడ్డాయి. కొడవలి, చేతి తొడుగులు, సంచులు, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో నేరపూరిత సాక్ష్యాలను దొరికిన తర్వాత అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

బాధితులను ఖలుషా ప్రలోభపెట్టడం తీసుకెళ్లి చంపడంలాంటివి చేసేవాడు. ఈ విషయాన్ని స్వయగా అతడే అంగీకరించాడు. కొంతమంది బాధితుల మృతదేహాలు గోనె సంచులలో కనిపించాయి. బుల్లెట్ గాయాలు లాంటివి ఏమీ లేవు. కొడవలిలాంటి వస్తువులను ఉపయోగించి చంపాడు. DNA పరీక్ష ద్వారా రెండు మృతదేహాలు గుర్తించారు. అయితే చాలా వరకు కుళ్ళిపోయిన కారణంగా గుర్తించలేపోయారు. ఇప్పటి వరకు తన భార్యతో సహా 42 మంది మహిళలను చంపినట్టుగా నిందితుడు ఒప్పుకొన్నాడు.

2022 నుంచి 2024 జులై వరకు 42 మందిని హత్య చేశాడు. మహిళలను వలవేసి లొంగదీసుకుని ఈ హత్యలు చేసేవాడు. 26 ఏళ్ల జోసఫ్ అనే మహిళను కూడా అలాగే చంపేశాడు. అయితే ఆమె బయటకు వెళ్లే సమయంలో ఫోన్ కాల్ వచ్చినట్టుగా ఆమె సోదరి చెప్పడంతో పోలీసులు ఎంక్వైరీ చేశారు. దగ్గరలోనే నివాసం ఉంటున్న ఖలుషాను నిందితుడిగా గుర్తించారు.

మరోవైపు ఖలుషా న్యాయవాది జాన్ మైనా న్డెగ్వా మాత్రం.. తన క్లయింట్‌ను అధికారులు దుర్భాషలాడారని, ఒప్పుకోమని బలవంతం చేశారని పేర్కొన్నారు. నిందితుడు మెుదటిసారి కోర్టుకు హాజరు సమయంలో ఖలుషాకు వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తన క్లయింట్‌పై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

ఖలుషాను కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కేసు వివరాలు తెలుసుకునేందుకు మరింత సమయం ఇచ్చింది. ఈ హత్యలు వెలుగులోకి రావడంతో కెన్యాలో ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా అయింది. ఇప్పటికే రాజకీయ అశాంతి, ఆర్థిక సవాళ్లు, పెరుగుతున్న లింగ ఆధారిత హింసతో పోరాడుతున్న దేశం కావడంతో ఈ ఘటన వైరల్ అయింది.

టాపిక్

తదుపరి వ్యాసం