Citroen electric car India : సిట్రోయెన్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే!
27 September 2022, 7:01 IST
- Citroen electric car India launch : సిట్రోయెన్ నుంచి భారత మార్కెట్లోకి ఓ ఎలక్ట్రిక్ కారు వస్తోంది. ఈ నెల 29న దానిని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
సిట్రోయెన్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే!
Citroen electric car India launch date : ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్.. ఇండియాలో తమ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ క్రమంలో.. ఈ నెల 29న సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్నట్టు సిట్రోయెన్ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
"ఈ నెల 29న కలుసుకుందాము," అని ఆ పోస్టులో వెల్లడించింది సిట్రోయెన్ సంస్థ. 2023లో ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్తామని సిట్రియోన్ గతంలో చెప్పింది. సిట్రోయెన్ సీ3 ఎస్యూవీ లాంచ్ సమయంలోనే ఎలక్ట్రిక్ వాహనాలపై హింట్ ఇచ్చింది. దాని కన్నా ముందే.. ఏర్పాట్లు చేసుకున్నట్టు తాజా పరిణామాల ద్వార తెలుస్తోంది.
Citroen electric car in India : అయితే సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కారు.. సరసమైన ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. టాటా పంచ్ వినియోగించే కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కారు కూడా రూపొందుతుందని తెలుస్తోంది.
ఈ సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కారుపై ప్రస్తుతం వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెల 29న దీనిపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే.. ఈ ఏడాది జులైలో లాంచ్ చేసిన ఐసీఈ వర్షెన్‌ను ఈ సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కారు పోలి ఉంటుందని భావిస్తున్నారు. టాటా టియాగో ఈవీకి ఈ సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కారు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Citroen electric car launch : అంతర్జాతీయంగా.. నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తోంది సిట్రోయెన్. అమీ, సీ4 ఎలక్ట్రిక్ ఎస్యూవీ, రెండు ఎంపీవీలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్‌కి 50కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లభించే అవకాశం ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో 350కి.మీలు ప్రయాణించవచ్చు. ఇది 1326బీహెచ్పీ పవర్, 260ఎన్ఎం టార్క్ జెనరేట్ చేయగలదని తెలుస్తోంది.
Citroen electric car : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు ఇండియా.. అత్యంత ఆకర్షణీయమైనదిగా మారింది. ఇటీవలి కాలంలో ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు ఆటో సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. ఈ సెగ్మెంట్లో తొలుత ప్రవేశించిన టాటా మోటార్స్‌కు 85శాతానికిపైగా మార్కెట్ వాటా ఉంది. అయితే.. ఇటీవలి కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా- టాటా మోటార్స్ మధ్య ఎలక్ట్రిక్ వాహనాల పోటీ విపరీతంగా పెరిగిపోయింది.
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ లాంచ్ చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్‌యూవీ400 గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.