Tata Tiago EV features: టాటా మోటార్స్ ఈ సెప్టెంబరు 28న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్ టాటా టియాగో ఈవీని ఆవిష్కరించనుంది. టాటా మోటార్స్ నుంచి ప్రాచుర్యం పొందిన టియాగో కారుకు ఇది ఎలక్ట్రిక్ వెర్షన్. టాటా మోటార్స్ నుంచి రానున్న మూడో ఎలక్ట్రిక్ కారు ఇది. ఎస్‌యూవీ, సెడాన్లలో ఇప్పటికే ఈవీ వచ్చినప్పటికీ హాచ్‌బ్యాక్ కార్లలో ఎలక్ట్రిక్ కారు రావడం ఇదే తొలిసారి.
కాగా వచ్చే వారమే టాటా టియాగో ఈవీ మార్కెట్లోకి వస్తున్నందున ఈ కారు ఫీచర్లను టాటా మోటార్స్ వెల్లడించింది. టాటా టియాగో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని టాటా మోటార్స్ వెల్లడించింది. టిగోరో ఈవీలో వినియోగించిన 26కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను దీనిలో కూడా వినియోగించనున్నట్టు తెలుస్తోంది.
టిగోర్ ఈవీ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఒక గంట సేపు ఛార్జింగ్ చేస్తే 80 శాతం ఛార్జ్ అవుతుంది. టియాగో ఒక సింగిల్ ఛార్జింగ్‌పై 300 కి.మీ. దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. హై ఎనర్జీ డెన్సిటీ కలిగిన 21.5 కేడబ్ల్యూహెచ్, 16.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. దీనిని కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికిల్ టాటా ఎక్స్‌ప్రెస్ -టీ లో వినియోగిస్తున్నారు. ఇది 105 ఎన్ఎం టార్క్‌తో 41 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది.
కాగా టాటా టియాగో ఈవీ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో వస్తోంది. టాటా మోటార్స్ ఈవీ వెహికిల్స్‌లో ఉన్న జడ్‌కనెక్ట్ టెక్నాలజీని ఇందులో కూడా ఇస్తోంది. అలాగే స్మార్ట్ వాచ్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. టాటా టియాగో ఈవీ ప్రీమియం లెతరెట్ సీట్స్ కలిగి ఉంటుంది.
రానున్న టాటా టియాగో ఈవీ క్రూయిజ్ మోడ్, వన్ పెడల్ డ్రైవ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. వన్ పెడల్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా డ్రైవ్ చేసే వారు పటిష్టమైన రీజనరేటివ్ బ్రేకింగ్‌ను ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ ప్యాక్ నుంచి ఛార్జింగ్‌ను సేవ్ చేస్తుంది.
టియాగో ఈవీ ఐసీఈ, సీఎన్జీ వెర్షన్లు కలిగిన ఏకైక భారతీయ హాచ్‌బ్యాక్ మోడల్ కానుంది. మొన్నటి జనవరిలో టాటా మోటార్స్ టియాగో సీఎన్జీ వెర్షన్‌ను విడుదల చేసింది.