తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Love Brain Disease: పదేపదే లవర్ కు ఫోన్ చేస్తున్నారా? ‘లవ్ బ్రెయిన్’ జబ్బు ఉందేమో చెక్ చేసుకోండి..!

Love brain disease: పదేపదే లవర్ కు ఫోన్ చేస్తున్నారా? ‘లవ్ బ్రెయిన్’ జబ్బు ఉందేమో చెక్ చేసుకోండి..!

HT Telugu Desk HT Telugu

24 April 2024, 18:24 IST

  • Love brain: చైనాలోని ఒక 18 సంవత్సరాల వయస్సున్న ఒక యువతి ‘లవ్ బ్రెయిన్’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు ఒక్క రోజులోనే 100 కు పైగా ఫోన్ కాల్స్ చేసిందని తెలిపారు. చైనా యువతికి ‘లవ్ బ్రెయిన్’ వ్యాధి; ఈ జబ్బు లక్షణాలేంటి?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనాలో ఓ మహిళకు 'లవ్ బ్రెయిన్'(love brain) అనే మానసిక వ్యాధి ఉన్నట్లు తేలింది. తన బాయ్ ఫ్రెండ్ కు ఆమె ఒక రోజులో 100 సార్లకు పైగా ఫోన్ చేసిందని, అతడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని పదేపదే ప్రశ్నించేదని, అతడెప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకునేదని ఆమెకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.

లవ్ బ్రెయిన్ అంటే ఏమిటి?

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం, జియావోయు అనే మహిళకు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మానసిక వ్యాధిని వ్యావహారికంగా "లవ్ బ్రెయిన్ (love brain)" అని పిలుస్తారు. ఈ పరిస్థితి యాంక్జైటీ, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి ఇతర మానసిక అనారోగ్యాలతో కలిసి ఉండవచ్చని చెంగ్ డూ లోని ఫోర్త్ పీపుల్స్ హాస్పిటల్ వైద్యుడు మరియు జియావోయుకు చికిత్స చేసిన డాక్టర్ డు నా చెప్పారు.

మొదట్లో బాగానే ఉంది..

పై చదువుల కోసం యూనివర్సిటీకి వెళ్లేంత వరకు ఆ 18 సంవత్సరాల వయస్సున్న జియావోయు (Xiaoyu) అనే యువతి ఆరోగ్యంగానే ఉంది. యూనివర్సిటీలో ఆమెకు ఒక యువకుడు పరిచయమయ్యాడు. వారి మధ్య ప్రేమ ప్రారంభమైంది. అయితే, ఆ యువకుడు ఆమె పొసెసివ్ నెస్ ను తట్టుకోలేకపోయాడు. తాను "అసౌకర్యంగా, అణచివేయబడినట్లుగా" భావించసాగాడు. దాంతో ఆమెకు దూరమవడం ప్రారంభించాడు. దాంతో, ఆ యువతిలో అభద్రతాభావం మరింత పెరిగింది. అది లవ్ బ్రెయిన్ గా మారింది. జియావోయు (Xiaoyu) తన ప్రియుడి నుండి "నిరంతర అటెన్షన్"ను కోరింది. అతనిపై పూర్తిగా ఆధారపడింది. ఆమె పగలు, రాత్రి అన్ని సమయాల్లో తన ఫోన్ సందేశాలను వెంటనే రిప్లై ఇవ్వాలని కోరుకుంది.

సోషల్ మీడియాతో..

చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఆమె వీడియో ఒకటి వైరల్ కావడంతో జియావోయు ప్రవర్తన వెలుగులోకి వచ్చిందని ఎస్సీఎంపీ (SCMP) నివేదించింది. ఆ వీడియోలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు వీచాట్ కెమెరా స్విచ్ ఆన్ చేయమని మెసేజ్ చేస్తుంది. పదేపదే కాల్స్ చేస్తుంది. 100 సార్లు ఫోన్ చేసిన రోజు అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె తన ఇంట్లో ఉన్న వస్తువులను పగులగొట్టింది. మరోవైపు, ప్రియుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో, జియావోయు ఇంటికి చేరుకున్న పోలీసులకు, ఆమె తాను బాల్కనీ నుంచి దూకేస్తానని బెదిరించింది.

లవ్ బ్రెయిన్ అనవద్దు..

అయితే, ఆమె పరిస్థితిని "లవ్ బ్రెయిన్ (love brain)" అని పిలవడం పట్ల చైనా నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. "ఆమెది లవ్ బ్రెయిన్ కాదు.. ఆమె కేవలం ఒక కంట్రోల్ ఫ్రీక్’’ అని ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఒక యూజర్ రాశాడు. ‘‘ మై గాడ్.. నాకు కూడా లవ్ బ్రెయిన్ ఉందా? నేను కూడా ఆమెలాగానే ప్రవర్తిస్తాను’’ అని మరో యువతి స్పందించింది. ఈ సమస్య (love brain) కు చికిత్స ఉందని, అయితే, సమస్య తీవ్రం కాకముందే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ డు తెలిపారు.

తదుపరి వ్యాసం