Delusional Love Disorder : అందగాళ్ల సంఘానికి అధ్యక్షుడిలా ఫీలవుతాడు.. ఇదో మానసిక వ్యాధి.. నవ్వుకోకండి.. సీరియస్ మ్యాటర్
Delusional Love Disorder : కొంతమంది తమను తాము చూసి అందంగా ఫీలవుతారు. అంతేకాదు అందరూ నన్నే చూస్తున్నారని అనుకుంటారు. ఇలాంటిదే ఓ యువకుడు అరుదైన రుగ్మతతో బాధపడుతున్నాడు.
చాలా మంది నేను బాగానే ఉన్నానని, అందరూ నా వైపు చూస్తున్నారని అనుకుంటారు. అమ్మాయిలందరూ నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతారు. కానీ వాస్తవం వేరు. ఈ రుగ్మత గురించి ప్రజలకు తెలియదు. మానసిక సమస్యలను ముందుగా గుర్తించడం కష్టం. దానిని సాధారణమని భావిస్తాం. చాలా విషయాలను సీరియస్‌గా తీసుకోరు. సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు వైద్యుల వద్దకు వెళతారు. ఇప్పుడు కూడా ఇది మానసిక వ్యాధి అని ప్రజలు అంత తేలికగా అంగీకరించరు. శారీరక అనారోగ్యంలాగే మానసిక అనారోగ్యానికి కూడా చికిత్స అవసరం. సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తే మానసిక వ్యాధి కూడా త్వరగా నయమవుతుంది.
ప్రస్తుతం చైనాలో ఓ యువకుడు వార్తల్లో నిలిచాడు. అతని సమస్య అందరినీ ఆశ్చర్యపరిచింది. లియు అనే 20 ఏళ్ల యువకుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ చైనా యువకుడికి తన చుట్టూ ఉన్న అమ్మాయిలంతా తనతో ప్రేమలో ఉన్నారని భ్రమపడటం మొదలుపెట్టాడు. ఆడపిల్లలు దగ్గరకు వచ్చినా పట్టించుకోడు. అమ్మాయిలు ఏం చేసినా తన కోసమేనని భ్రమలో ఉంటాడు.
అందరికంటే అందంగా ఉన్నానుకుంటాడు
యూనివర్శిటీలో చదువుతున్న లియు.. అక్కడి యువకులందరికంటే తానే అందంగా ఉన్నానని భ్రమపడతాడు. అమ్మాయిలంతా తన వెంటే ఉంటారనే అనుకుంటాడు. లియు కూడా చాలా మంది అమ్మాయిలకు పెద్ద సమస్యగా తయారయ్యాడు. లియు మొదట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ దీని ప్రభావం చదువుపై కనిపించింది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టక.. ఆ తర్వాత డాక్టర్‌ని కలిసినప్పుడు తన సమస్య ఏంటో తెలుసుకున్నాడు.
అందరూ ఇష్టపడతారని భావించి..
ఈ ఏడాది ఫిబ్రవరిలో లియుకు సమస్యలు మొదలయ్యాయి. పగలు, రాత్రి.. లియు అమ్మాయిలు తనను ప్రేమిస్తారని, అందరూ ఇష్టపడతారనే నమ్మకంతో జీవించడం ప్రారంభించాడు. వాస్తవికత, ఊహ మధ్య తేడా తెలియలేదు. ఎందుకో తెలుసుకోవడానికి లియు ఆసుపత్రికి వెళ్లాడు. అప్పుడు లియు డెల్యూషనల్ లవ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధిలో ప్రేమ అనే భావనతో ప్రభావితమవుతారు.
డెల్యూషనల్ లవ్ డిజార్డర్ అంటే
భ్రమ కలిగించే ప్రేమ రుగ్మత అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఈ స్థితిలో ఊహ నుండి వాస్తవికతను వేరు చేయడం కష్టం అవుతుంది. అందులో వేధింపులు, అసూయలు కనిపిస్తాయి. ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు తమ చుట్టూ ఉన్నవారు నా పట్ల రొమాంటిక్‌గా ఉన్నారని భావిస్తారు. ఇది రోజువారీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఇది రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. చుట్టుపక్కల వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం సాధ్యం కాదు. చదువు, పని, నిద్ర సమస్యగా మారుతుంది.
డెల్యూషనల్ లవ్ డిజార్డర్ సెక్స్ అడిక్షన్ వంటి వాటిని కలిగి ఉంటుంది. చాలా సార్లు రోగులు దూకుడుగా ఉంటారు. సోషల్ మీడియాను ఉపయోగించే వారిలో ఈ సమస్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని ముందుగా గుర్తించి, వ్యాధి ముదిరేలోపు సత్వర చికిత్స అందిస్తే సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు. మీరు కూడా ఇలా అనుకుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.