తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhattisgarh Elections : 40ఏళ్లల్లో తొలిసారి.. ఓటేసేందుకు సిద్ధమవుతున్న 40 గ్రామాల ప్రజలు!

Chhattisgarh elections : 40ఏళ్లల్లో తొలిసారి.. ఓటేసేందుకు సిద్ధమవుతున్న 40 గ్రామాల ప్రజలు!

Sharath Chitturi HT Telugu

14 October 2023, 8:50 IST

google News
  • Chhattisgarh assembly elections : ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ జిల్లాలో.. 40ఏళ్ల తర్వాత, 40గ్రామాల్లో తొలిసారి ఓటింగ్​ జరగనుంది. వివరాల్లోకి వెళితే..

40ఏళ్లల్లో తొలిసారి.. ఓటేసేందుకు సిద్ధమవుతున్న 40 గ్రామాల ప్రజలు!
40ఏళ్లల్లో తొలిసారి.. ఓటేసేందుకు సిద్ధమవుతున్న 40 గ్రామాల ప్రజలు! (PTI)

40ఏళ్లల్లో తొలిసారి.. ఓటేసేందుకు సిద్ధమవుతున్న 40 గ్రామాల ప్రజలు!

Chhattisgarh assembly elections 2023 : ఈ దఫా ఛత్తీస్​గఢ్​ ఎన్నికలు ప్రత్యేకంగా నిలువనున్నాయి! 40 గ్రామాలు.. 40ఏళ్ల తర్వాత ఓటింగ్​లో పాల్గొననుండటం ఇందుకు కారణం.

40ఏళ్లల్లో తొలిసారి ఇలా..

దేశవ్యాప్తంగా.. నక్సల్స్​ ప్రభావం అధికంగా ఉన్న అతి తక్కువ ప్రాంతాల్లో ఛత్తీస్​గఢ్​ ఒకటి. ముఖ్యంగా.. రాష్ట్రంలోని బస్తర్​​ జిల్లాలో నక్సల్స్​ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఈ జిల్లాలోని 40 గ్రామాల్లోని ప్రజలు.. గత 40ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇంకా చెప్పాలంటే.. ఈ ప్రాంతాల్లో పోలింగ్​ నిర్వహించడమే చాలా కష్టంగా ఉండేది.

ఈ 40 గ్రామాల్లో.. శనివారం 120 పోలింగ్​ కేంద్రాలను రీఓపెన్​ చేయనుంది ఎన్నికల సంఘం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.

Chhattisgarh election 2023 : గత 5ఏళ్లల్లో.. ఆయా ప్రాంతాల్లో 60కిపైగా భద్రతా దళాల క్యాంప్​లను ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా దళాలు అక్కడి పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఫలితంగా అక్కడ పరిస్థితుల్లో భారీ మార్పులు కనిపించాయి. 5ఏళ్లల్లోనే.. ఆ గ్రామాల్లో ఓటింగ్​ నిర్వహించడం సులభమైపోయింది. ఇక ఇప్పుడు.. ఈ ప్రాంతాల్లో పోలింగ్​ నిర్వహించేందుకు.. అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది ఈసీ.

"నవంబర్​ 7వ తేదీన.. బస్తర్​ విభాగంలోని 7 జిల్లాల్లో పోలింగ్​ జరగనుంది. భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తున్నాము. ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరిగేందుకు.. అన్ని విధాలుగా కృషిచేస్తున్నాము. ఈసారి అంతా సరిగ్గానే జరుగుతుందని నమ్మకంగా ఉంది," అని బస్తర్​ డివిజన్​ ఐజీపీ సుందర్​రాజ్​ తెలిపారు.

ఎన్నికలు ఎప్పుడంటే..

Chhattisgarh elections date : 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే నెలలో మొదలుకానున్నాయి. ఛత్తీస్​గఢ్​లో నవంబర్​ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

ఛత్తీస్​గఢ్​లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్​ వచ్చేసి 46. 2018లో.. 68 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్​.. బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని స్థాపించింది. బీజేపీకి 15 సీట్లే వచ్చాయి! సీఎం భూపేష్​ భగేల్​ నేతృత్వంలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉంది. కానీ ఈసారి.. కాంగ్రెస్​ను ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది.

ఈసారి కూడా కాంగ్రెస్​కే అధికారం దక్కుతుందని పలు సర్వేలు సూచిస్తున్నాయి.

తదుపరి వ్యాసం