తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : టాయిలెట్​లో 15ఏళ్ల పనిమనిషి మృతదేహం- టార్చర్​ పెట్టి చంపిన దంపతులు!

Crime news : టాయిలెట్​లో 15ఏళ్ల పనిమనిషి మృతదేహం- టార్చర్​ పెట్టి చంపిన దంపతులు!

Sharath Chitturi HT Telugu

03 November 2024, 11:04 IST

google News
    • Chennai crime news : చెన్నైలో ఓ 15ఏళ్ల పనిమనిషి మృతదేహం ఓ ఇంటి టాయిలెట్​లో కనిపించింది. ఆ ఇంటి దంపతులు, ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు.
పనిమనిషిని చిత్రహింసలు పెట్టి చంపిన దంపతులు..
పనిమనిషిని చిత్రహింసలు పెట్టి చంపిన దంపతులు..

పనిమనిషిని చిత్రహింసలు పెట్టి చంపిన దంపతులు..

చెన్నైలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పని మనిషి మృతదేహం ఓ ఇంటి టాయిలెట్​లో కనిపించింది. ఆ ఇంటి యజమానులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు!

ఇదీ జరిగింది..

చెన్నై అమిన్జికరై ప్రాంతంలోని మెహ్తా నగర్​లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి వయస్సు 15ఏళ్లు. మహమ్మద్​ నిషాద్​, నసియా అనే దంపతుల ఇంట్లో ఆమె పని మనిషిగా చేరింది. అయితే ఆమెను ఆ దంపతులు నిత్యం చిత్రహింసలు పెట్టేవారు.

కొన్ని రోజుల క్రితం.. పోలీసులకు ఒక లాయర నుంచి ఫోన్​ వచ్చింది. మహమ్మద్​ ఇంట్లో పనిమనిషి మరణించిందని లాయర్​ చెప్పాడు. సంబంధిత ఇంటికి వెళ్లేసరికి, టాయిలెట్​లో బాలిక మృతదేహం పోలీసులకు కనిపించింది. ఆమె శరీరం నిండా గాయాలు కనిపించాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులకు అసలు నిజం తెలిసింది. దంపతులు మహమ్మద్​ నిషాద్​, నసియాలు ఆ బాలికను సిగెరట్లతో గుచ్చేవారు. వేడివేడి ఐరన్​ రాడ్​తో వాతలు పెట్టారు. ఆ రోజు కూడా ఇదే జరిగింది! ఈసారి గాయాల తీవ్రత అధికమైంది. గాయాలతో ఉన్న బాలికను పట్టించుకోకుండా వదిలేశారు. తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని టాయిలెట్​లో పడేసి, మహమ్మద్​- నసియాలు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ విషయాన్ని మహమ్మద్​ తన లాయర్​కి చెప్పాడు. ఆ లాయర్​.. పోలీసులకు ఫోన్​ చేసి చెప్పడంతో ఈ విషయం బయటపడింది.

ఇంటి టాయిలెట్​ నుంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం మృతదేహాన్ని కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని స్పష్టం చేశారు.

మరోవైపు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సంబంధిత దంపతులను అరెస్ట్​ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురిని కూడా అరెస్ట్​ చేశారు.

బాలిక తల్లి తంజావూర్​ జిల్లాలో నివాసముంటోంది. ఆమెకు భర్త లేడు! కూతురి మరణ వార్త వినగానే ఆమె కృంగిపోయింది.

మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

తదుపరి వ్యాసం