Kadapa District : ప్రేమ పేరుతో మోసం..! మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు, పోక్సో కేసు నమోదు
కడప జిల్లాలో బాలికపై కన్నేసిన ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఏకంగా గర్భవతిని చేశాడు. వివాహం చేసుకోవాలని కోరగా… మోహం చాటేశాడు. విషయం కుటుంబ సభ్యుల దృష్టికి చేరటంతో… ముదివేడు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
కడప జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికను యువకుడు మోసం చేశారు. తీరా గర్భవతి చేసిన ముఖం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘోరమైన ఘటన కడప జిల్లా కురబలకోట మండలంలోని ఒక గ్రామంలో గురువారం వెలుగు చూసింది. ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపిన వివరాల మేరకు కురబకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) మదనపల్లెలోని ఓ జూనియర్ కాళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలిక నివాసముంటున్న ఇంటి పక్కనే ఉండే వారికి బంధువైన లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేటకు చెందిన ఖాదర్ బాషా (24) తరచూ కురబలకోట మండలంలోని ఆ గ్రామానికి వచ్చి వెళ్లేవాడు.
ఈ నేపథ్యంలో ఆ బాలికపై కన్నేశాడు. పక్క ఇంట్లో ఉండటంతో ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రేమించడం మొదలపెట్టాడు. ఇద్దరూ సరదాగా తరచూ మాట్లాడుకునేవారు. తన ప్రేమను ఆ బాలికకు చెప్పాడు. ఆమె కూడా తొలిత నిరాకరించింది. ప్రేమిస్తున్నానని బాలికను నమ్మించాడు. ఆమెకు తన ప్రేమను నమ్మి విధంగా ఆయన చర్యలు ఉండేవి. చాలా మంచివాడి ఆమె ముందు ప్రవర్తించేవాడు. ఆ యువకుడు ఒత్తిడి చేయడంతోనూ… ఆమె కూడా యువకుడును నమ్మడంతో ఆ ప్రేమను అంగీకరించింది.
దీంతో వారిద్దరి ప్రేమాయణం సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోని శారీరకంగా దగ్గర అయ్యారు. మాయమాటలు చెప్పి బాలికను ఖాదర్ బాషా గర్భవతిని చేశాడు. గర్భం దాల్చడంతో ఆమె తనను వివాహం చేసుకోవాలని కోరింది. దీనికి ఖాదర్ బాషా ముఖం చాటేశాడు. ఆ ఊరు కూడా రావడం మానేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపనకు గురైంది. తాను మోసపోయానని గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులకు జరిగి విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బాలిక ముదివేడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
పోలీసులకు జరిగిన విషయం మొత్తం వివరించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరు నెలల గర్భిణిగా నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఖాదర్‌బాషాపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. బాలిక పక్కింట్లో ఉన్నవారి సహకారంతోనే నిందితుడు ఈ పని చేశాడని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసును మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడికి బదిలీ చేశారు. ఆయన కేసును విచారిస్తున్నారు.