తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uk Pm Race : ప్రధాని రేసులో నో బోరిస్​.. రిషి గెలుపు దాదాపు ఖాయం!

UK PM race : ప్రధాని రేసులో నో బోరిస్​.. రిషి గెలుపు దాదాపు ఖాయం!

25 October 2022, 10:53 IST

google News
    • Boris Johnson out of UK PM race : బ్రిటన్​ ప్రధాని రేసు నుంచి బోరిస్​ జాన్సన్​ తప్పుకున్నారు. మరోవైపు.. ప్రధాని రేసులో రిషి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చేస్తుంది.
రిషి సునక్​ గెలుపు ఖాయం!
రిషి సునక్​ గెలుపు ఖాయం! (HT_PRINT)

రిషి సునక్​ గెలుపు ఖాయం!

Boris Johnson out of UK PM race : బ్రిటన్​ ప్రధాని రేసు నుంచి బోరిస్​ జాన్సన్​ తప్పుకున్నారు. ప్రధాని పదవి కోసం ఆయన నామినేషన్​ వేయలేదు. ఫలితంగా ఇప్పుడు ప్రధానమంత్రి పోటీ భారత సంతతి రిషి సునక్​, పెన్నీ మోర్డాంట్​ మధ్యే ఉండనుంది.

వాస్తవానికి బ్రిటన్​ ప్రధానమంత్రి రేసు ముగ్గురు మధ్య ఉంటుందని అందరు భావించారు. అందుకు తగ్గట్టుగానే మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ సైతం ఇన్ని రోజులు పావులు కదిపారు. కానీ అనూహ్యంగా రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

"నాకు పార్టీ సభ్యుల మద్దతు ఉంది. పోటీ చేస్తే.. శుక్రవారం నాటికి తిరిగి నేను ప్రధానిగా ఉండగలను. కానీ ఇలా చేయడం సరైనది కాదని నాకు అనిపించింది. పార్టీలో ఐకమత్యం లేకపోతే.. పదవి దక్కినా లాభం లేదు," అని బోరిస్​ జాన్సన్​ ఓ ప్రకటన విడుదల చేశారు.

బ్రిటన్​ ప్రధాని రేసులో తాను ఉన్నట్టు జాన్సన్​ అధికారికంగా ఎప్పుడు ప్రకటించలేదు. కానీ ఆయన చర్యలు చూస్తే.. పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. తనకు 102మంది కన్జర్వేటివ్​ పార్టీ సభ్యుల మద్దతు ఉందని బోరిస్​ చెప్పారు.

రిషి గెలుపు ఖాయం..!

Rishi Sunak next UK PM : ఇక బోరిస్​ జాన్సన్​ అధికారికంగా తప్పుకోవడంతో ఇప్పుడు పోటీ అంతా పెన్నీ మోర్డాంట్​, రిషి సునక్​ మధ్య ఉంది. ప్రధాని రేసులో ఉండాలంటే కనీసం 100మంది పార్టీ ఎంపీల మద్దతు అవసరం. అయితే.. రిషి సునక్​కు ఇప్పటికే 142మంది ఎంపీల మద్దతు లభించినట్టు తెలుస్తోంది. కానీ పెన్నీకి 29మంది ఎంపీల మద్దతే ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంకొన్ని గంటల్లో 100మంది మద్దతును కూడగట్టుకోలేకపోతే.. ప్రధాని రేసు నుంచి ఆటోమేటిక్​గా పెన్నీ తప్పుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఎలాంటి పోటీ లేకుండానే ప్రధాని పదవిని చేపడతారు రిషి సునక్​.

రూల్స్​ ప్రకారం.. బ్యాలెట్​ పేపర్​ ఎన్నిక వరకు వెళ్లాలంటే.. పోటీదారుకు కనీసం 100మంది మద్దతు ఉండాలి. ఇద్దరు ఫైనలిస్ట్​ల్లో ఒకరిని 1,70,000మంది పార్టీ సభ్యులు ఆన్​లైన్​ పద్ధతిలో ఓట్లు వేస్తారు. వచ్చే శుక్రవారం నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుంది.

ఇక తాను ప్రధాని రేసులో పోటీ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు రిషి సునక్​. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు పోటీ చేస్తున్నా,’ అని ప్రకటనలో తెలిపారు.

లిజ్​ ట్రస్​ రాజీనామాతో..

UK political crisis : పార్టీలో చీలక కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు బోరిస్​ జాన్సన్​. జులై నుంచి సెప్టెంబర్​ వరకు తదుపరి ప్రధాని ఎన్నిక కార్యకలాపాలు జరిగాయి. తొలుత రిషి సునక్​.. రేసులో దూసుకెళ్లారు. కానీ ఆ తర్వాత ఆయనకు మద్దతు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో.. బ్రిటన్​ ప్రధానిగా సెప్టెంబర్​ తొలి వారంలో బాధ్యతలు స్వీకరించారు లిజ్​ ట్రస్​.

కొత్త ప్రధానిపై దేశ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. బ్రిటన్​ రాజకీయ సంక్షోభానికి తెరపడిందని భావించారు. కానీ 45రోజుల పదవీకాలం అనంతరం లిజ్​ ట్రస్​.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల నేపథ్యంలో ఆమెకు సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. ఫలితంగా బ్రిటన్​ రాజకీయ సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది!

తదుపరి వ్యాసం