తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rishi Sunak Uk Pm : ‘పోటీ చేస్తున్నా’- యూకే ప్రధాని రేసులో రిషి సునక్​

Rishi Sunak UK PM : ‘పోటీ చేస్తున్నా’- యూకే ప్రధాని రేసులో రిషి సునక్​

23 October 2022, 16:19 IST

  • Rishi Sunak UK PM candidate : బ్రిటన్​ ప్రధాని పదవి కోసం తాను పోటీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు రిషి సునక్​. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ప్రధాని రేసులో రిషి.. అధికారిక ప్రకటన విడుదల
ప్రధాని రేసులో రిషి.. అధికారిక ప్రకటన విడుదల (REUTERS)

ప్రధాని రేసులో రిషి.. అధికారిక ప్రకటన విడుదల

Rishi Sunak UK PM : బ్రిటన్​ ప్రధాని రేసులో తాను ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు భారత సంతతి రిషి సునక్​. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం, పార్టీలో ఐకమత్యాన్ని తీసుకురావడం కోసం తాను పోటీ చేస్తున్నట్టు ఆదివారం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

రిషి సునక్​కు ఇప్పటికే 100మందికి పైగా కన్జర్వేటివ్​ పార్టీ ఎంపీల మద్దతు ఉంది. బ్రిటన్​ ప్రధాని రేసులో పాల్గొనాలంటే.. అభ్యర్థికి కనీసం 100మంది పార్టీ సభ్యుల మద్దతు అవసరం.

"దేశ ఆర్థిక వ్యవస్థను ఫిక్స్​ చేయాలని నాకు ఉంది. పార్టీలో ఐకమత్యాన్ని తీసుకురావాలని ఉంది. గతంలో కన్నా బ్రిటన్​ ప్రజల అవకాశాలను మెరుగుపరచాలా లేదా అన్నది ఇప్పుడు ఇక నా పార్టీ నిర్ణయించాలి," అని రిషి సునక్​ ట్వీట్​ చేశారు.

పోటీలో ముగ్గురు..!

UK next PM : ఈసారి ప్రధాని రేసులో ఈసారి ముగ్గురు ఉండే అవకాశం ఉంది. పోటీలో ఉన్నట్టు పెన్నీ మోర్డౌంట్​ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి 42ఏళ్ల రిషి సునక్​ చేరారు. మూడో పోటీదారుడిగా.. మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ నిలిచే అవకాశం ఉంది. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. రేసులో నిలబడేందుకు బోరిస్​ సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా.. శనివారమే బోరిస్​ జాన్సన్​ రిషి సునక్​తో భేటీ అయ్యారు. ఎన్నికల విషయంపై, పార్టీలో చీలక రాకుండా చూసుకునే విషయంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

బోరిస్​ జాన్సన్​ రాజీనామాతో.. జులైలో మొదలైన బ్రిటన్​ ప్రధాని ఎన్నిక ప్రక్రియ.. ఆగస్టు చివరి వరకు సాగింది. అందులో గెలిచి.. సెప్టెంబర్​లో బాధ్యతలు చేపట్టారు లిజ్​ ట్రస్​. అయితే.. ఈసారి అంత సుదీర్ఘంగా ఎన్నిక ప్రక్రియ సాగదు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ నెల 28తో బ్రిటన్​ ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది.

లిజ్​ ట్రస్​ రాజీనామా..

UK Politics : ప్రధాని పదవిని చేపట్టిన 45రోజులకే బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు లిజ్​ ట్రస్​. ఆర్థిక వ్యవస్థకు ఆమె సూచించిన మార్పులు బెడిసికొట్టడంతో ఒత్తిడి పెరిగి, రాజీనామా చేయకతప్పలేదు. ఫలితంగా మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.

గత ఎన్నికల్లో రిషి సునక్​కు తొలినాళ్లల్లో మద్దతు భారీగా లభించింది. కానీ చివర్లో ఆయన గెలవలేకపోయారు. ఈసారి కూడా ఆయనకు మద్దతు పెరుగుతోంది. బోరిస్​ మద్దతుదారులు కూడా రిషి సునక్​కు ఓటు వేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి రిషి సునక్​ గెలుస్తారా? బ్రిటన్​ ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారా? మరి ఇప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి.