HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyber Scam : నిమిషాల్లో రూ. 1.2 కోట్లు దోచుకున్న సైబర్​ నేరగాళ్లు.. తస్మాత్​ జాగ్రత్త!

Cyber scam : నిమిషాల్లో రూ. 1.2 కోట్లు దోచుకున్న సైబర్​ నేరగాళ్లు.. తస్మాత్​ జాగ్రత్త!

Sharath Chitturi HT Telugu

23 July 2024, 6:47 IST

  • Bengaluru Cyber crime : బెంగళూరుకు చెందిన ఓ 77ఏళ్ల వృద్ధురాలు.. సైబర్​ నేరానికి బాధితురాలిగా మారింది. సైబర్​ మోసగాళ్లు ఆమె నుంచి రూ. 1.2కోట్లు దోచుకున్నారు!

సైబర్​ స్కామ్​కు రూ. 1.2 కోట్లు కోల్పోయిన వృద్ధురాలు!
సైబర్​ స్కామ్​కు రూ. 1.2 కోట్లు కోల్పోయిన వృద్ధురాలు! (Pexels)

సైబర్​ స్కామ్​కు రూ. 1.2 కోట్లు కోల్పోయిన వృద్ధురాలు!

దేశంలో సైబర్​ నేరగాళ్ల కార్యకలాపాలు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఏదో ఒక విధంగా ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళ, సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 12 కోట్లు కోల్పోయింది!

ఇదీ జరిగింది..

కొందరు సైబర్​ నేరగాళ్లు టెలికాం శాఖ అధికాలుగా నటిస్తూ 77ఏళ్ల లక్ష్మీ శివకుమార్ అనే వృద్ధురాలికి ఫోన్ చేశారు. తన పేరిట ఉన్న సిమ్ కార్డును ఉపయోగించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ మాటలు విన్న ఆమె భయపడిపోయింది.

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదులు అందినట్టు సైబర్​ క్రిమినల్స్​ ఫోన్​లో చెప్పారు. ఆమె సిమ్​ కార్డును వాడి మనీలాండరింగ్​కి పాల్పడినట్టు చెబుతూ.. లక్ష్మీ శివకుమార్​ బ్యాంక్​ ఖాతాలు, ఇన్​వెస్ట్​మెంట్​ వివరాలను ఇవ్వాలని, లేకపోతే అరెస్ట్​ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు.. ఆమెను నమ్మించేందుకు ఫేక్​ ఎఫ్​ఐఆర్​ డాక్యుమెంట్​తో పాటు ఏకంగా నకిలీ సుప్రీంకోర్టు అరెస్ట్​ వారెంట్​ పత్రాలను కూడా పంపించారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని, దర్యాప్తు పూర్తైన తర్వాత తిరిగి ఇచ్చేస్తామని అన్నారు. డాక్యుమెంట్లు చూసి మరింత భయపడిపోయిన ఆ వృద్ధురాలు.. ముందు, వెనుక ఆలోచించకుండా తన బ్యాంకు ఖాతా వివరాలను చెప్పేసింది. చివరికి.. ఆమె నుంచి రూ. 1,28,700 డబ్బును మోసగాళ్లు దోచుకున్నారు. ఆ తర్వాత వారికి- వృద్దురాలికి కనెక్షన్​ తెగిపోయింది. వారిని తిరిగి కాంటాక్ట్​ అయ్యేందుకు ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ఫలితం దక్కలేదు. చివిరికి, తాను మోసపోయినట్టు తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండటానికి, ఈ సెక్యూరిటీ టిప్స్​ని అనుసరించండి:

1. అవాంఛిత కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని.. తెలియని వారితో లేదా ధృవీకరించని లింకుల ద్వారా పంచుకోవద్దు.

2. అధికారిక మార్గాల ద్వారా డబ్బు లేదా వ్యక్తిగత వివరాల కోసం ఏవైనా అభ్యర్థనల ప్రామాణికతను తనిఖీ చేయండి.

3. మాల్వేర్, ఇతర బెదిరింపుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు మీ పరికరాలలో సెక్యూరిటీ సాఫ్ట్​వేర్స్​ని ఇన్​స్టాల్​ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్​ చేసుకోండి.

4. సైబర్​ క్రైమ్​పై అవగాహన కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా తాజా సైబర్ నేరాలు, మోసాల గురించి తెలుసుకోండి.

5. సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల్లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

6. అన్ని ఆన్​లైన్​ ఖాతాలకు బలమైన, సంక్లిష్టమైన పాస్​వర్డ్స్​ని ఉపయోగించండి. సాధ్యమైనప్పుడు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్​ని ప్రారంభించండి.

7. మీ బ్యాంక్ ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే వెంటనే నివేదించండి.

అప్రమత్తంగా ఉండటం ద్వారా, మీరు ఆన్​లైన్​ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. డబ్బు సురక్షితంగా ఉంచుకోవచ్చు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్