Cyber Crime | ఎంపీకే టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. లక్ష మాయం-cyber crime gang cheated kurnool ysrcp mp sanjeev kumar ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cyber Crime | ఎంపీకే టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. లక్ష మాయం

Cyber Crime | ఎంపీకే టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. లక్ష మాయం

HT Telugu Desk HT Telugu
May 04, 2022 07:42 PM IST

సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంపీ సైతం డబ్బులు పొగొట్టుకున్నారు. బ్యాంకు వివరాలు అప్ డేట్ చేయాలంటూ.. కాల్ చేసి.. సుమారు లక్ష వరకూ కాజేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ కాలంలో కాస్త.. ఆదమరిచి.. బ్యాంకు వివరాలు చెబితే అంతే క్షణాల్లో సైబర్ నేరగాళ్లు డబ్బును లాగేస్తారు. ప్రముఖులు సైతం కొన్నిసార్లు సైబర్ నేరాలకు బలవుతున్నారు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి.. నమ్మించి డబ్బులు దోచుకుంటారు. ఓటీపీలు అడిగారంటే.. ఇక అంతే సంగతి.. మీ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైనట్టే. తాజాగా వైసీపీ ఎంపీ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. లక్ష వరకూ పోగొట్టుకున్నారు.

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కు సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. మీ బ్యాంక్ ఎకౌంట్ బ్లాక్ అయిందని చెప్పారు. వెంటనే.. పాన్ నెంబర్ తో లింక్ చేయాలన్నారు. నిజమేననుకుని ఎంపీ నమ్మారు. ఫోన్ కు మెసేజ్ వచ్చిందని అది చెప్పాలని కోరారు. వెంటనే.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామంటూ మరో ఫోన్ వచ్చింది. అకౌంట్ కు సంబంధించిన వివరాలు అడిగారు. ఖాతా క్లోజ్ అవుతుందేమోనుకున్న అభిప్రాయంలో ఉన్న ఎంపీ అన్నీ చెప్పేశారు.

సైబర్ నేరగాడు అడిగిన అకౌంట్ వివరాలు, ఓటీపీ నెంబర్లు తెలిపారు. వెంటనే.. ఎంపీ సంజీవ్ కుమార్ అకౌంట్ నుంచి రూ.48,700, రూ.48,999 విత్ డ్రా అయినట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. మొత్తం రూ.97,699 బురిడీ కొట్టించారు. అప్పుడు ఎంపీకి అసలు విషయం అర్థమైంది. వెంటనే కర్నూలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

IPL_Entry_Point

టాపిక్