Fire accident : షాపింగ్ మాల్లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం!
01 March 2024, 7:18 IST
Bangladesh fire accident : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢాకాలోని ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగిన ఘటనలో 44మంది మరణించారు.
షాపింగ్ మాల్లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం!
Bangladesh fire accident : ఘోర అగ్నిప్రమాదంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉలిక్కిపడింది! ఓ షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 44మంది మరణించారు. మరో 20మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
ఢాకాలోని బైలే రోడ్డులో గ్రీన్ కోజీ కాజేట్ పేరుతో.. ఓ కమర్షియల్ షాపింగ్ మాల్ ఉంది. అందులో అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. కాగా.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల 45 నిమిషాల సమయంలో.. మొదటి అంతస్తులోని 'కచ్చి భాయ్' అనే రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే మంటలు మొదటి అంతస్తును వ్యాపించాయి. అనంతరం ఇతర ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి.
Dhaka fire accident today : బంగ్లాదేశ్ అగ్నిప్రమాదం సమయంలో.. రెస్టారెంట్లలో చాలా మంది భోజనం చేస్తున్నారు. మంటలను చూసి వెంటనే.. మాల్ లోపల ఉన్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. తమని తాము రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. భవనం మీద నుంచి చాలా మంది దూకి ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు పొగకు ఊపిరి ఆడక మరణించారు. ఇంకొందరు.. కాలిన గాయాలతో ప్రాణాలు విడిచారు.
ఢాకా అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలానికి వెంటనే పరుగులు తీశారు. 13 ఫైర్ సర్వీస్ యూనిట్లు.. తీవ్రంగా శ్రమించి, అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో మంటలను అదుపు చేశారు. అనంతరం.. 75మందిని రక్షించారు. వారిలో స్పహృకోల్పోయి, నేల మీద పడి ఉన్న 42మంది కూడా ఉన్నారు.
Dhaka fire accident death toll : ఆరోగ్య శాఖ మంత్రి సమంత లాల్ సేన్‌తో పాటు ఇతర అధికారులు సైతం ఘటనాస్థలానికి వెళ్లి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
"బంగ్లాదేశ్ అగ్నిప్రమాదం ఘటనలో 44మంది మరణిచారు.75మందిని రక్షించాము. ప్రస్తుతం వారందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు," అని ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు.
ఢాగా అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?
Bangladesh fire accident death toll : వివిధ అంతస్తుల్లోని రెస్టారెంట్స్‌లో ఉన్న గ్యాస్ సిలిడర్ల కారణంగా బంగ్లాదేశ్ అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తొలుత మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని, అది మిగిలిన అంతస్తులకు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు సరిగ్గా చూడలేకపోయారని, ఫలితంగా మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.