తెలుగు న్యూస్  /  National International  /  An Apology From Rahul Gandhi: The Most Confronting Issue Of The Nation?

Rahul Gandhi apology : రాహుల్​ గాంధీ ‘క్షమాపణల’ కోసం బీజేపీ ఆరాటం.. తెర వెనుక కారణమేంటి?

HT Telugu Desk HT Telugu

22 March 2023, 14:56 IST

  • Rahul Gandhi apology : యూకే ప్రసంగం నేపథ్యంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది. ఈ విషయంపై పార్లమెంట్​లో అధికార పక్షమే అలజడులు సృష్టిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ (Hindustan Times/file)

రాహుల్​ గాంధీ

Rahul Gandhi apology : ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన వాటిల్లో పార్లమెంట్​ ఒకటి. కానీ పార్లమెంట్​లో ఈ మధ్య కాలంలో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉభయసభల​ కార్యకలాపాలు సాగుతున్న తీరును గమనిస్తున్న సామాన్యుడికి.. పార్లమెంట్​పై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. గత రెండు వారాల్లో.. పార్లమెంట్​ కార్యకలాపాలు మొత్తానికే తుడిచిపెట్టుకుపోయాయి. వాస్తవానికైతే.. పార్లమెంట్​లో అలజడులు సహజమైన విషయమే. అధికారపక్షంపై విపక్షాలు నిరసనలు చేస్తూ, సభ కార్యకలాపాలను దెబ్బతీస్తూనే ఉంటాయి. ఈసారి నెలకొన్న పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నం! అధికారపక్షం నిరసనలతో పార్లమెంట్​ అట్టుడికింది.

ట్రెండింగ్ వార్తలు

Canada working hours: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్; ఇక వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్

Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Stabbings in London: లండన్ లో కత్తితో దుండగుడి వీరంగం; పలువురికి గాయాలు

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

టార్గెట్​.. రాహుల్​ గాంధీ?

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుబడుతోంది. దేశ ప్రజస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా ఆయన మాట్లాడారని, భారత్​ ప్రతిష్ఠను దెబ్బతీశారని కమలదళం ఆరోపిస్తోంది. రాహుల్​ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేస్తోంది. ఈ రగడ పార్లమెంట్​ మెట్లు ఎక్కింది. కీలక బిల్లులపై చర్చలు జరపాల్సిన పార్లమెంట్​లో.. రాహుల్​ గాంధీ క్షమాపణల అంశం అనూహ్యంగా గందరగోళాన్ని సృష్టించింది. దేశంలో వేరే ఏ సమస్య లేనట్టు.. ఇదొక్కటే ఇప్పుడు పార్లమెంట్​లో హాట్​టాపిక్​గా మారింది.

BJP attack on Rahul Gandhi : రాహుల్​ గాంధీ చేత క్షమాపణలు చెప్పించడమే తమ లక్ష్యంగా బీజేపీ పెట్టుకున్నట్టు తాజా పరిణామాలను చూస్తే అనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ వ్యవహారం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాహుల్​ గాంధీ క్షమాపణలు చేప్పడం, దేశానికి అత్యావశ్యకం అన్నట్టుగా అధికార పక్షం చిత్రీకరిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాహుల్​ గాంధీ నిజంగానే.. భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడారా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. కాంగ్రెస్​ సీనియర్​ నేతపై కమలదళం ఈ రేంజ్​లో ఎందుకు టార్గెట్​ చేసింది? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి.. రాహుల్​ గాంధీతో బీజేపీకి ప్రస్తుతం పొంచి ఉన్న ముప్పేమీ లేదు. 'పప్పు' అన్న బిరుదుని తొలగించుకునేందుకు రాహుల్​ ఇప్పుడిప్పుడే కృషిచేస్తున్నారు. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే.. రాహుల్​ గాంధీకి ఇంకా చాలా సమయం పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో.. పార్లమెంట్​ను స్తంభింపచేసి మరీ రాహుల్​ గాంధీని కమలదళం ఉక్కిరిబిక్కిరి చేయాల్సినంత అవసరం కమలదళానికి ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అదానీ వ్యవహారాన్ని పక్కనపెట్టేందుకేనా?

Rahul Gandhi UK speech : రాహుల్​ గాంధీ ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తొలుత భారత్​ జోడో యాత్రతో.. దేశం చూపును తనవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు యూకేలో భారత్​పై, భారత్​లోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ఆయన్ని బీజేపీ టార్గెట్​ చేస్తోంది. అధికారపక్షం టార్గెట్​ చేస్తోంది అంటే.. ఖచ్చితంగా ఆయనపై వార్తలు పెరుగుతాయి. ఆయనపై ఫోకస్​ పడుతుంది. దీనితో ఒకరకంగా రాహుల్​ గాంధీకే మంచి చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్​ గాంధీని బీజేపీ ఎంత వెంటాడితే.. ఆయనకు అంత మద్దతు, సానుభూతి పెరుగుతుందని అంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములను పక్కనపెడితే.. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడగలిగే వ్యక్తిగా ప్రజల్లో ఆయనకు గుర్తింపు లభించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. రాహుల్​ గాంధీ.. తన ఇమేజ్​ను పెంచుకునేందుకు కమలదళమే కృషిచేస్తోందని చెబుతున్నారు.

Rahul Gandhi parliament news : అయితే.. యావత్​ ప్రపంచంలో సంచలనంగా మారిన అదానీ వ్యవహారాన్ని ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. రాహుల్​ గాంధీని బీజేపీ టార్గెట్​ చేసిందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అదానీ వ్యవహారంపై సభలో చర్చ జరిగి చాలా కాలమైపోయింది. సభ కార్యకలాపాలు సాగే చాలా కాలమైంది. రాహుల్​ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ అధికారపక్షానికి చెందిన సీనియర్​లు కూడా సభలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.

Rahul Gandhi BJP latest news : రాహుల్​ గాంధీ చేసింది తప్పా? ఒప్పా? అన్నది పక్కనపెడితే.. ఓ వ్యక్తి క్షమాపణల కోసం.. పార్లమెంట్​ను స్తంభింపచేస్తున్న అధికారపక్షం.. ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు సమస్యలపై చర్చలు ఎప్పుడు జరుగుతాయి? లేదా.. ఎవరూ ప్రశ్నించకుండా చేసి, అధికారాన్ని తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం చూస్తోందా? లేక దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయా? అన్న ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి!