తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Cases In India : ఒక్క రోజులో 841 కొవిడ్​ కేసులు.. 7 నెలల్లో ఇదే తొలిసారి!

Covid cases in India : ఒక్క రోజులో 841 కొవిడ్​ కేసులు.. 7 నెలల్లో ఇదే తొలిసారి!

Sharath Chitturi HT Telugu

31 December 2023, 12:50 IST

    • Covid cases in India : దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా.. 7 నెలల తర్వాత, ఒక్క రోజులో 841 కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఒక్క రోజులో 841 కొవిడ్​ కేసులు.. 7 నెలల్లో ఇదే తొలిసారి!
ఒక్క రోజులో 841 కొవిడ్​ కేసులు.. 7 నెలల్లో ఇదే తొలిసారి! (PTI)

ఒక్క రోజులో 841 కొవిడ్​ కేసులు.. 7 నెలల్లో ఇదే తొలిసారి!

Covid cases in India : ఓవైపు నూతన ఏడాది వేడుకలు ఘనంగా సాగుతున్న వేళ.. మరోవైపు దేశంలో కొవిడ్​ పరిస్థితులు అందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే 841 కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కొవిడ్​ భయాలు మరింత పెరిగాయి. ఇలా.. ఒక్క రోజులో 800కుపైగా కేసులు నమోదవ్వడం.. 7 నెలల్లో ఇదే తొలిసారి! కొవిడ్​ కేసుల పెరుగుదలకు కొత్తగా పుట్టుకొచ్చిన సబ్​వేరియంట్​ జేఎన్​.1 కారణమన్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఇండియాలో పెరుగుతున్న కొవిడ్​ కేసులు..

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన డేటా ప్రకారం.. దేశంలో కొవిడ్​ యాక్టివ్​ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 4,309గా ఉండేది. కొవిడ్​ కారణంగా కేరళ, కర్ణాటక, బిహార్​లో ముగ్గురు మరణించారు. శనివారం.. ఇండియాలో 743 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆ సంఖ్య 841కి పెరిగింది.

JN.1 cases in India : వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఇండియా లో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. చాలా నెలల వరకు ఇండియావ్యాప్తంగా కొవిడ్​ కేసుల సంఖ్య డబుల్​ డిజిట్​లోనే నమోదైంది. కానీ.. జేఎన్​.1 సబ్​ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. ఒక్కసారిగా ముండంకెల డిజిట్​ నమోదవుతూ, అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇక ఇండియాలో మొత్తం మీద ఇప్పటివరకు 4.50 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 5,33,361 మంది కొవిడ్​కు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇటీవలి కాలంలో జేఎన్​.1 కేసులు పెరుగుతున్నా, రికవరీ రేటు భారీగా ఉండటం కాస్త ఉపశమనాన్ని కల్పించే విషయం. ప్రస్తుతం కొవిడ్​ రికవరీ రేటు 98.81శాతంగా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్​ టీకాలను పంపిణీ చేసింది కేంద్రం.

India Covid cases latest news : ఇక జేఎన్​.1 సబ్​వేరియంట్​ విషయానికొస్తే.. ఇండియాలో ఇప్పటివరకు 178 కేసులు వెలుగులోకి వచ్చాయి. గోవాలో అత్యధికంగా 47మంది ఈ కొత్త వేరియంట్​ బారినపడ్డారు. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (41), గుజరాత్​ (36), కర్ణాటక (34) రాష్ట్రాలు ఉన్నాయి.

న్యూ ఇయర్​ వేళ అప్రమత్తం..

సరిగ్గా పండుగ సీజన్​ ప్రారంభమైన సమయంలోనే జేఎన్​.1 కొవిడ్​ కేసుల సంఖ్య ఇండియాలో పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. మరీ ముఖ్యంగా న్యూ ఇయర్​ వేడుకల కోసం ప్రజలు భారీ ఎత్తు ప్రయాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో కొవిడ్​ ప్రొటోకాల్స్​ పాటించాలని సూచిస్తున్నారు.

JN.1 covid variant in India : అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్​ సోకే ప్రమాదం ఉందని, అందుకే.. వివిధ రోగాలు ఉన్న వారు పర్యటనలు చేపట్టకపోవడం శ్రేయస్కరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం