తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Covid Cases Updates : మరో 8 మందికి కరోనా - తెలంగాణలో 59కి చేరిన యాక్టివ్ కేసులు

Telangana Covid Cases Updates : మరో 8 మందికి కరోనా - తెలంగాణలో 59కి చేరిన యాక్టివ్ కేసులు

26 December 2023, 21:44 IST

    • Covid Cases in Telangana Updates : తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొత్తగా 8 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 59 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైదారోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణ కొవిడ్ కేసులు
తెలంగాణ కొవిడ్ కేసులు

తెలంగాణ కొవిడ్ కేసులు

Covid Cases in Telangana : తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో మంగళవారం 1,333 మందికి పరీక్షలు నిర్వహించగా… 8 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 59కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 99.51శాతంగా ఉందని, మరణాల రేటు 0.49శాతం ఉన్నట్లు తెలిపింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

డిసెంబర్ 26వ తేదీ నాటి కొవిడ్ రిపోర్ట్ - వైదారోగ్యశాఖ :

తెలంగాణలో కొత్త కొవిడ్ కేసులు - 8

కోలుకున్న వారి సంఖ్య - 04

మరణాల రేటు - 0.49శాతం

రికరవరీ రేటు - 99.51శాతం.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య - 59

మంగళవారం నిర్వహించిన పరీక్షల సంఖ్య - 1,333

మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4170 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. అయితే తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం రికార్డు అయ్యింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌ లక్షణాలతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌లకు కూడా కోవిడ్ సోకింది. వివిధ అనారోగ్య కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. వీరిని కోవిడ్ పరీక్ష చేయగా... పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

తదుపరి వ్యాసం