తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Major Football Stadium Disasters : ఫుట్​బాల్​ మ్యాచ్​లలో రక్తపాతం.. 40ఏళ్లల్లో ఎన్నో ఘటనలు!

Major football stadium disasters : ఫుట్​బాల్​ మ్యాచ్​లలో రక్తపాతం.. 40ఏళ్లల్లో ఎన్నో ఘటనలు!

Sharath Chitturi HT Telugu

02 October 2022, 15:51 IST

google News
    • Major football stadium disasters Timeline : ఫుట్​బాల్​ మ్యాచ్​లలో రక్తపాతం నమోదు కావడం గత 40ఏళ్లుగా ప్రపంచం చూస్తూనే ఉంది. ఇండోనేషియా ఘటనలో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. 
ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండ దృశ్యాలు
ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండ దృశ్యాలు (AP)

ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండ దృశ్యాలు

Indonesia football stadium stampede : ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​లో రక్తపాతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఇప్పటికే 174మంది మరణించారు. మరో 180మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే.. ఫుట్​బాల్​ మ్యాచ్​లో హింసాకాండ.. కొత్త విషయమేమీ కాదు! 40ఏళ్లుగా ఇలాంటి దృశ్యాలకు ప్రపంచం సాక్ష్యంగా నిలుస్తూనే ఉంది.

ఫుట్​బాల్​ మ్యాచ్​లలో రక్తపాతం..

2022 జనవరి, కామెరూన్​:- కామెరూన్​ ప్రాంతంలోని యోండె ఒలెంబె స్టేడియంలో జరిగిన హింసాకాండలో 8మంది మరణించారు. 38మంది తీవ్రంగా గాయపడ్డారు.

Major football stadium disasters Timeline : 2012 ఫిబ్రవరి, ఈజిప్ట్​:- అల్​ మశ్రి, అల్​ అహ్లెయ్​ జట్ల మధ్య పోర్ట్​ సిటీలో మ్యాచ్​ జరిగింది. ఆ తర్వాత తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో 73మంది మరణించారు. 1000మంది గాయపడ్డారు. ఈజిప్టియన్​ లీగ్​.. రెండేళ్ల పాటు సస్పెండ్​ అయ్యింది.

2009 మార్చ్​, ఐవరీ కోస్ట్​:- అబిడ్జన్​ ఫెలిక్స్​ హోఫౌట్​ స్టేడియంలో.. వరల్డ్​ కప్​ క్వాలిఫయింగ్​ మ్యాచ్​కి ముందు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19మంది మరణించారు.

Major football stadium disasters : 2001 మే, ఘానా:- అక్రే మెయిన్​ ఫుట్​బాల్​ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. అభిమానులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో 120మంది మరణించారు. ఆఫ్రికాలోని అతిపెద్ద ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండ ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది.

2001 ఏప్రిల్​, సౌత్​ ఆఫ్రికా:- జోహెన్నెస్​బర్గ్​లోని ఎల్లిస్​ పార్క్​ స్టేడియంలో.. సౌత్​ ఆఫ్రికా లీగ్​ మ్యాచ్​ జరుగుతున్న సమయం అది. అభిమానులు.. స్టేడియం లోపలికి చొచ్చుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో 43మంది మరణించారు.

Indonesia football stadium stampede death toll : 1996 అక్టోబర్​, గౌటెమల:- గౌటెమల, కోస్టా రీకాల మధ్య గౌటెమల నగరంలో వరల్డ్​ కప్​ క్వాలిఫయింగ్​ మ్యాచ్​ జరిగింది. అభిమానులు సృష్టించిన అలజడిలో 80మందికిపైగా ప్రజలు మరణించారు.

1992 మే, ఫ్రాన్స్​:- బస్టియా ఫురైని స్టేడియంలో ఫ్రెంచ్​ కప్​ సెమీఫైనల్​ మ్యాచ్​ జరిగింది. ఒక్కడే ఉన్న ఓ స్టాండ్​.. ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 18మంది మరణించారు. 2300మంది గాయపడ్డారు.

1991 జనవరి, సౌత్​ ఆఫ్రికా:- ఒప్పెన్​హైమర్​ స్టేడియంలో కైజర్​ ఛీఫ్స్​, ఒర్లాండో పైరేట్స్​ మధ్య మ్యాచ్​ జరుగుతోంది. పైరేట్స్​ ఫ్యాన్​ ఒకడు.. ఛీఫ్స్​ మద్దతురాలుపై కత్తితో దాడి చేశాడు. అనంతరం జరిగిన తొక్కిసలాట ఘటనలో 42మంది మరణించారు.

1989 ఏప్రిల్​, ఇంగ్లాండ్​:- హిల్స్​బోరఫ్​ స్టేడియంలో ఎఫ్​ఏ కప్​ సెమీఫైనల్​ మ్యాచ్​ జరిగింది. లివర్​పూల్​, నాటింగ్హమ్​ ఫారెస్ట్​ జట్లు తలపడ్డాయి. స్టేడియం సామర్థ్యానికి మంచిన అభిమానలు తరలివెళ్లారు. ఈ తొక్కిసలాటలో 96మంది లివర్​పూల్​ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ వ్యక్తి.. 32ఏళ్ల పాటు ప్రాణాలతో పోరాడి ఈ ఏడాది జూన్​లో మరణించాడు.

Indonesia football stadium stampede news : 1988 మార్చ్​, నేపాల్​:- ఖాట్మండూలోని నేపాల్​ ఫుట్​బాల్​ స్టేడియంలో ఓ మ్యాచ్​ జరిగింది. అనూహ్యంగా తుపాను ప్రతాపం చూపించింది. అభిమానులు పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో 90మంది మృతిచెందారు.

1985 మే, బెల్జియం:- బ్రసెల్స్​లోని హెయ్​సెల్​ స్టేడియంలో యూరోపియన్​ కప్​ పైనల్​ మ్యాచ్​ జరిగింది. జువెన్​టస్​, లివర్​పూల్​ జట్లు తలపడ్డాయి. ఫ్యాన్​ వార్​లో 39మంది ప్రాణాలు కోల్పోయారు. 600మంది గాయపడ్డారు.

1985 మే, ఇంగ్లాండ్​:- బ్రాండ్​ఫోర్డ్​లోని పరేడ్​ స్టేడియంలో థర్డ్​ డివిజన్​ మ్యాచ్​ జరుగుతున్న వేళ.. అక్కడి స్టాండ్స్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తొక్కిసలాటలో 56మంది మరణించారు. 200మంది గాయపడ్డారు.

Major football match tragedies : 1982 అక్టోబర్​, రష్యా:- యూఫా కప్​లో భాగంగా మాస్కోలోని ఓ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఎన్నో ఏళ్ల పాటు ఈ విషయంపై గోప్యత వహించింది సోవియట్​ ప్రభుత్వం. చివరిగా.. ఘటనపై స్పందించి.. 66మంది మరణించినట్టు వెల్లడించింది. ఘటనకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు!

తదుపరి వ్యాసం