Indonesia Football Riots: పుట్ బాల్ మ్యాచ్ లో హింసాకాండ.. 127 మంది దుర్మరణం!-at least 127 dead after riot at indonesia football match ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  At Least 127 Dead After Riot At Indonesia Football Match

Indonesia Football Riots: పుట్ బాల్ మ్యాచ్ లో హింసాకాండ.. 127 మంది దుర్మరణం!

Mahendra Maheshwaram HT Telugu
Oct 02, 2022 07:32 AM IST

riot at Indonesia football match: ఇండోనేషియాలో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి దారితీసింది. ఇరు జట్ల ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 127 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

పుట్ బాల్ మ్యాచ్ లో హింసాకాండ
పుట్ బాల్ మ్యాచ్ లో హింసాకాండ

Indonesia football match: ఇండోనేషియాలో ఘోర దుర్ఘటన జరిగింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్ లో జరిగిన అల్లర్లలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఈస్ట్ జావాలో జరిగిన ఇండోనేషియన్ లీగ్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా టీమ్(3-2 తేడాతో) ఓడిపోయింది. సొంత మైదానంలో చిరకాల ప్రత్యర్థులు చేతిలో ఓటమిపాలయ్యామని ఆగ్రహించిన అభిమానులు.. మైదానంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లి.... అల్లర్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్‌ చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసు అధికారులు, పిల్లలు, అభిమానులు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

"ఈ ఘటనలో 127 మంది మరణించారు. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. 34 మంది స్టేడియంలోనే మరణించారు. మిగిలినవారు ఆసుపత్రిలో మరణించారు" అని తూర్పు జావా పోలీసు చీఫ్ నికో అఫింటా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘ఒక ఎగ్జిట్ గేట్ నుంచి ఒక్కసారిగా అందరూ పరిగెత్తటంతో ఈ ఘటన జరిగింది. ఇందులో చాలా మంది నలిగిపోయారు. తొక్కిసలాట జరగటంతో చాలా మంది చనిపోయారు. స్టేడియంలో అల్లర్లను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాం’ అని అఫింటా పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనపై ఇండొనేషియా ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది.

IPL_Entry_Point

టాపిక్