Amarnath Yatra 2023 : నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు..
17 April 2023, 8:23 IST
- Amarnath Yatra 2023 : ఈ ఏడాది జులై 1న ప్రారంభంకానున్న అమర్నాథ్ యాత్రలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే మీకు ముఖ్యమైన అప్డేట్. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది.
నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు..
Amarnath Yatra 2023 registration : హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. జమ్ముకశ్మీర్లో 62రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర 2023 జులై 1న మొదలవుతుంది. ఆగస్టు 31తో ముగుస్తుంది.
దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ ఆలయం ఉంటుంది. అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో 2023 అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. అయితే 13-70ఏళ్ల మధ్యలో ఉన్న వారే ఈ యాత్రలో పాల్గొనగలరు. అదే సమయంలో 6నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లలేరు.
2023 అమర్నాథ్ యాత్రి రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
Amarnath Yatra 2023 dates : స్టెప్ 1:- అమర్నాథ్ ఆలయ బోర్డుకు చెందిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- ఆన్లైన్ సర్వీస్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే 'రిజిస్టర్' కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4:- సంబంధిత వివరాలను వెల్లడించాలి. సబ్మీట్ చేయాలి.
స్టెప్ 5:- ఓటీపీ వెరిఫై చేసుకోవాలి.
Amarnath Yatra 2023 : స్టెప్ 6:- అప్లికేషన్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎస్ఎంఎస్ వస్తుంది.
స్టెప్ 7:- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
స్టెప్ 8:- అమర్నాథ్ యాత్ర పర్మీట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.
Amarnath Yatra 2023 latest updates in Telugu : దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్బీ, ఎస్బీఐ, జమ్ముకశ్మీర్ బ్యాంక్, యెస్ బ్యాంక్ బ్రాంచ్లలో అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎస్ఏఎస్బీ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది.
అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 120 చెల్లించాలి. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 220. ఎన్ఆర్ఐ భక్తులు పీఎన్బీ బ్యాంక్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 1520 చెల్లించాలి.