తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇద్దరు ఉగ్రవాదులు హతం.. పాకిస్థాన్​ ‘మిషన్​ అమర్​నాథ్​ యాత్ర’ ఫెయిల్​!

ఇద్దరు ఉగ్రవాదులు హతం.. పాకిస్థాన్​ ‘మిషన్​ అమర్​నాథ్​ యాత్ర’ ఫెయిల్​!

Sharath Chitturi HT Telugu

14 June 2022, 6:36 IST

google News
    • సోమవారం అర్ధరాత్రి జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అమర్​నాథ్​ యాత్రలో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా వీరు ప్రణాళికలు రచించినట్టు సమాచారం.
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు (PTI/file)

సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

అమర్​నాథ్​ యాత్రలో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా దేశంలోకి చొరబడిన ఇద్దరు పాక్​ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని బేమినా ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కాగా.. ఈ ఎన్​కౌంటర్​లో ఓ పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.

టార్గెట్​ అమర్​నాథ్​ యాత్ర..!

జూన్​ 30న అమర్​నాథ్​ యాత్ర ప్రారంభంకానుంది. యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్​ ఉగ్రసంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే పటిష్ఠ భద్రతను చేపట్టిన సైన్యం.. తాజా ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను ఎలిమినేట్​ చేసింది.

"అనంతనాగ్​కు చెందిన అదిల్​ హుస్సెన్​.. 2018లో సరిహద్దును దాటి పాకిస్థాన్​కు వెళ్లాడు. అక్కడ ఉగ్రవాదంలో శిక్షణ పొందాడు. అతడితో పాటు మరో ఇద్దరిని లష్కరే తోయిబా.. జమ్ముకశ్మీర్​లోకి పంపించింది. ఎన్​కౌంటర్​లో ఇద్దరు హతమయ్యారు. అదిల్​ ఇప్పటికే మరణించాడు," అని కశ్మీర్​ జోన్​ పోలీస్​ ట్వీట్​ చేసింది.

ఇదొక భారీ విజయం అని కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ అభిప్రాయపడ్డారు. మృతుల నుంచి డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. మరణించిన ఇద్దరిలో ఒకరు పాకిస్థాన్​లోని ఫైసలాబాద్​కు చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు.

ఎన్​కౌంటర్​ అనంతరం రెండు ఏకే-47 రైఫిళ్లు, 10 మ్యాగజైన్లు, వై ఎస్​ఎంఎస్​ డివైజ్​తో పాటు మరికొన్ని వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

తదుపరి వ్యాసం