Jammu and Kashmir : ఆరు నెలల్లో 100మంది ఉగ్రవాదులు హతం.. కానీ!
Jammu and Kashmir : ఈ ఏడాది ఇప్పటివరకు 100మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కానీ దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Jammu and Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. అంటే ఆరు నెలల్లో 100మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. వీరిలో 30మంది పాకిస్థాన్ దేశస్థులు సైతం ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఫలితంగా.. జమ్ముకశ్మీర్‌లో ఈ ఏడాది మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 100కు చేరింది.
కశ్మీర్ లోయ నుంచి ఉగ్రవాదులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. సరిహద్దు నుంచి చొరబాట్లు, యువతను ఉగ్రవాదంలోకి నియమించుకునే ప్రక్రియ సైతం జోరుగా సాగుతోంది. కశ్మీర్ లోయలో ఇప్పటికీ వివిధ ఉగ్రసంస్థలకు చెందిన 158 ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది లష్కరే తోయిబాకు చెందినవారే! అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కశ్మీర్ లోయలో 83మంది ఎల్ఈటీ ముష్కరులు ఆశ్రయం పొందుతున్నారు. మరో 30మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఉన్నరు. వీరితో పాటు 38మంది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కూడా కశ్మీర్ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఉరి, కశ్మీర్ వెలుపల ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్స్‌లో కార్యకలాపాలు ఊపందుకున్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ.. వందలాది మంది లష్కర్, జైషే, అఫ్గాన్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి.. లాంచ్ ప్యాడ్స్‌కు పంపుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దు వెంబడి దేశంలోకి చొరబడి.. అమర్నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు వీరు ప్రణాళికలు రచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అమర్నాథ్ యాత్రలో విధ్వంసం..!
Amarnath yatra 2022 : అమర్నాథ్ యాత్రలోని భద్రతా బలగాలపై బాంబు దాడులు జరగవచ్చు. ఎన్‌హెచ్-44పై విధ్వంసం సృష్టించేందుకు ఎల్ఈటీ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు భద్రతా బలగాలకు నిఘా సంస్థల నుంచి సమాచారం అందింది.
అప్రమత్తమైన అధికారులు.. 400కుపైగా పారామిలిటరీ కంపెనీలను రంగంలోకి దింపారు. కట్టుదిట్టమైన భద్రతు ఏర్పాటు చేశారు.
సంబంధిత కథనం
జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్… ముగ్గురు ఉగ్రవాదులు హతం
June 12 2022
కశ్మీర్లో ఉగ్రవాదుల మరో ఘాతుకం
May 24 2022