జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్… ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాల్లో రెండు వేర్వేరు చోట్ల ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా లోని వేర్వురు ప్రాంతాల్లో జరిగిన ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఓ ఉగ్రవాది హతం అయ్యాడు.
'ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వారి వద్ద నుంచి ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది'అని జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఉగ్రవాదుల్లో ఒకరి పేరును జునైద్ షీర్గోజ్రీగా అధికారులు గుర్తించారు. మే13 వ తేదీన భద్రతా సిబ్బంది రియాజ్ అహ్మద్ ను హతం చేసిన ఘటనలో ఇతనికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సాయంత్రం 6.55 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
టాపిక్