తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Yatra : అమర్​నాథ్​ యాత్రకు వెళుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

Amarnath Yatra : అమర్​నాథ్​ యాత్రకు వెళుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu

27 June 2022, 16:03 IST

google News
    • Amarnath Yatra 2022 : మరికొన్ని రోజుల్లో అమర్​నాథ్​ యాత్ర ప్రారంభం కానున్న వేళ.. యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది జమ్ముకశ్మీర్​ యంత్రాంగం. ఆ వివరాలు..
అమర్​నాథ్​ యాత్రకు వెళుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
అమర్​నాథ్​ యాత్రకు వెళుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. (Bikas Bhagat)

అమర్​నాథ్​ యాత్రకు వెళుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

Amarnath Yatra 2022 : ఈ నెల 30న అమర్​నాథ్​ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్ముకశ్మీర్​ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • అమర్​నాథ్​ యాత్ర సమయంలో ఉష్ణోగ్రతలు 5డిగ్రీల కన్నా తక్కువకు పడిపోవచ్చు. అందువల్ల యాత్రికులు ఉన్నితో తయారు చేసిన దుస్తులను తెచ్చుకోవాలి.
  • గొడుగు, హీటర్​, రెయిన్​కోట్​, వాటర్​ ప్రూఫ్​ షూ తెచ్చుకోవాలి. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
  • దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులను వాటర్​ ప్రూఫ్​ బ్యాగుల్లో పెట్టుకోవాలి.
  • ఐడీ కార్డులు, డ్రైవింగ్​ లెసెన్సు, యాత్రకు అనుమతి పత్రాలు కచ్చితంగా ఉండాలి.

ఇవి చేయకూడదు..

  • అమర్​నాథ్​ యాత్ర వేళ.. హెచ్చరికలు ఉన్న చోట ఆగకూడదు, వాహనాలు నిలపకూడదు.
  • స్లిప్పరు వేసుకోకూడదు. ట్రెక్కింగ్​ షూలు మాత్రమే ధరించాలి.
  • షార్ట్​ కట్స్​తో కూడిన మార్గాల కోసం ప్రయత్నించకూడదు. అది ప్రమాదకరం. అమర్​నాథ్​ యాత్ర కోసం నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలి.
  • కాలుష్యం, పర్యావరణం దెబ్బతినే విధంగా ఎలాంటి పనులు చేయకూడదు.
  • ప్లాస్టిక్​ను అస్సలు వినియోగించకూడదు. చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడతాయి.

భద్రతా ఏర్పాట్లు..

Amarnath yatra security : అమర్​నాథ్​ యాత్ర వేళ పూంచ్​ జిల్లా డిప్యూటీ కమీషనర్​, డిప్యూటీ ఐజీ, సీనియర్​ ఎస్పీతో కూడిన సీనియర్​ అధికారులతో జమ్ముకశ్మీర్​ యంత్రాంగం ప్రత్యేక చర్చలు జరిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఆలయ నిర్వాహణ కమిటీ, సివిల్​ సొసైటీ సభ్యులు, కోఆర్డినేషన్​ కమిటీ, వ్యాపారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని వారందరు వెల్లడించారు.

అమర్​నాథ్​ యాత్ర నేపథ్యంలో పూంచ్​ జిల్లా.. భద్రతావలయంలోకి జారుకుంది. జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతను చేపట్టారు. ఏడీజీపీ.. పూంచ్​ జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.

అమర్​నాథ్​ యాత్రలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు.

తదుపరి వ్యాసం