జూన్​ 30 నుంచి అమర్​నాథ్​ యాత్ర-amarnath yatra 2022 date announced ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జూన్​ 30 నుంచి అమర్​నాథ్​ యాత్ర

జూన్​ 30 నుంచి అమర్​నాథ్​ యాత్ర

HT Telugu Desk HT Telugu
Mar 27, 2022 05:37 PM IST

Amarnath yatra 2022 date | ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర జూన్​ 30న ప్రారంభంకానుంది. 43రోజుల పాటు యాత్ర జరగనుంది.

<p>అమర్​నాథ్​ యాత్ర కోసం వెళుతున్న భక్తులు (ఫైల్​ ఫొటో)</p>
అమర్​నాథ్​ యాత్ర కోసం వెళుతున్న భక్తులు (ఫైల్​ ఫొటో) (HT_PRINT)

Amarnath yatra 2022 | పవిత్ర అమర్​నాథ్​ యాత్ర.. ఈ ఏడాది జూన్​ 30న ప్రారంభంకానుంది. మొత్తం మీద 43రోజుల పాటు యాత్ర సాగనుంది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ కార్యాలయం ఆదివారం ట్వీట్​ చేసింది. ఎల్​జీ మనోజ్​ సిన్హా నేతృత్వంలో జరిగిన అమర్​నాథ్​ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

2019లో జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో అమర్​నాథ్​ యాత్ర అర్థంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత యాత్రపై 2020 నుంచి కొవిడ్​ ప్రభావం పడుతూ వస్తోంది.

ఈసారి కొవిడ్​ నిబంధనలతో అమర్​నాథ్​ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు వెల్లడించారు.

ప్రతిఏటా.. లక్షలాది మంది భక్తులు అమర్​నాథుడిని దర్శించుకునేందుకు జమ్ముకశ్మీర్​కు వెళుతూ ఉంటారు. ఈ అమర్​నాథ్​ యాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది.

Whats_app_banner

సంబంధిత కథనం