తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Scheme For Women : మహిళలకు ప్రతి నెల ఉచితంగా రూ. 1000- ప్రభుత్వం కీలక నిర్ణయం!

Scheme for women : మహిళలకు ప్రతి నెల ఉచితంగా రూ. 1000- ప్రభుత్వం కీలక నిర్ణయం!

Sharath Chitturi HT Telugu

04 March 2024, 16:15 IST

google News
  • Mukhyamantri Mahila Samman Yojana : ముఖ్యమంత్రి  మహిళా సమ్మాన్​ యోజన పథకంలో భాగంగా.. మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇస్తామని దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్​లో పథకం గురించి వివరించింది.

మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం!
మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం!

మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం!

Delhi Budget highlights : దిల్లీలో నివాసముండే మహిళలకు ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 18ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు, ప్రతి నెల రూ. 1000 ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. దిల్లీ బడ్జెట్​లో భాగంగా 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన్​'ను ప్రవేశపెట్టింది.

మహిళలకు ఉచితంగా రూ. 1000 పథకం..!

దిల్లీ ఆర్థికశాఖ మంత్రి అతిషి సోమవారం.. రూ. 76వేల కోట్లు విలువ బడ్జెట్​ని ప్రవేశపెట్టారు. 'రామ రాజ్య' థీమ్​తో ఈ బడ్జెట్​ని రూపొందించినట్టు ఆమ్​ ఆద్మీ చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే.. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన కింద.. 18ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

"రూ. 2వేల కోట్లు విలువ చేసే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన పథకం ద్వారా.. మహిళల అభ్యున్నతి, సంక్షేమంపై దృష్టిపెట్టాము. అందుకే.. 18ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇస్తున్నాము. లబ్ధిదారుల కోసం రూ. 2,714 కోట్ల బడ్జెట్​ని ప్రతిపాదించాము," అని అతిషి అన్నారు.

Delhi Mahila Samman Yojana : అయితే.. ఈ పథకం ద్వారా ప్రతి నెల రూ. 1000 పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. సంబంధిత మహిళ వయస్సు 18ఏళ్లు పైబడి ఉండాలి. ఆమె దిల్లీ ఓటర్​ అయ్యి ఉండాలి. ఆమె ఇతర ప్రభుత్వ పథకాలు పొందకూడదు. సంబంధిత మహిళ ఇన్​కమ్​ ట్యాక్స్​ పేయర్​ అవ్వకూడదు.

జనవరిలో పబ్లీష్​ అయిన దిల్లీ ఫైనల్​ ఎలక్టోరల్​ డేటా ప్రకారం.. దేశ రాజధానిలో మొత్తం 67,30,371 మంది మహిళలు ఉన్నారు.

కొత్త పథకంపై కేజ్రీవాల్​ ప్రశంసలు..

ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన్​ పథకంపై ప్రసంశల వర్షం కురిపించారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. పథకం కోసం చాలా పొదుపు చేసినట్టు వివరించారు.

"మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం.. ప్రపంచంలోనే అతిపెద్దది. దిల్లీ మహిళల కోసం ఇవాళ ఓ పెద్ద ప్రకటన చేశాము. ఇక ఇప్పటి నుంచి డబ్బుల కోసం మహిళలు ఇతరులపై ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు నాకు చాలా భావోద్వేగమైనది. దిల్లీ ప్రజల రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. దిల్లీవాసులు నా కుటుంబంతో సమానం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య లభించాలి. ఇక కొత్త పథకం కోసం మేము చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. చాలా డబ్బులు పోగు చేశాము. ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాము. దిల్లీ మహిళలకు నా శుభాకాంక్షలు," అని కేజ్రీవాల్​ అన్నారు.

Delhi Mahila Samman Yojana eligibility : 18ఏళ్లు పైబడిన మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు కాని మహిళలు, పెన్షన్​ దక్కని మహిళలు, ట్యాక్స్​ పేయర్స్​ కాని మహిళలు.. ఈ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన పథకం ద్వారా లబ్ధిపొందొచ్చని కేజ్రీవాల్​ స్పష్టం చేశారు. లోక్​సభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. కొత్త పథకాన్ని అమలు చేస్తామని, సంబంధిత ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని అరవింద్​ కేజ్రీవాల్​ తెలిపారు.

తదుపరి వ్యాసం