తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Akasa Air Data Breach : ప్రయాణికుల డేటా ‘లీక్’​.. ఆకాశ్​ ఎయిర్​ క్షమాపణలు

Akasa Air data breach : ప్రయాణికుల డేటా ‘లీక్’​.. ఆకాశ్​ ఎయిర్​ క్షమాపణలు

Sharath Chitturi HT Telugu

28 August 2022, 13:55 IST

google News
  • Akasa Air data breach : ఆకాశ ఎయిర్​లో ప్రయాణికుల డేటా లీక్​ అయ్యింది. ఈ విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది.

ప్రయాణికుల డేటా లీక్​.. ఆకాశ్​ ఎయిర్​ ప్రకటన
ప్రయాణికుల డేటా లీక్​.. ఆకాశ్​ ఎయిర్​ ప్రకటన (AP)

ప్రయాణికుల డేటా లీక్​.. ఆకాశ్​ ఎయిర్​ ప్రకటన

Akasa Air data breach : విమానయాన రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ఆకాశ్​ ఎయిర్​కు మరో షాక్​ తగిలింది. ఆ సంస్థ నుంచి ప్రయాణికుల విలువైన డేటా లీక్​ అయ్యింది. ఆకాశ్​ ఎయిర్​ డేటా బ్రీచ్​ గురువారం జరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. సీఈఆర్​టీ-ఇన్​కి ఈ విషయాన్ని సొంతంగా తెలియజేసినట్టు ఆదివారం పేర్కొంది.

ప్రయాణికుల పేర్లు, లింగం, ఫోన్​ నెంబర్లు, ఈమెయిల్​-ఐడీ తదితర వివరాలు లీక్​ అయినట్టు ఆకాశ్​ ఎయిర్​ వివరించింది. ఘటనకు గల కారణాలు, ఈ డేటా లీక్​కు ఎవరు పాల్పడ్డారు? అన్న వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టింది ఆకాశ ఎయిర్​.

"ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. అన్​అథారైజడ్​ యాక్సిస్​ను అడ్డుకున్నాము. సంబంధిత సిస్టమ్​లను వెంటనే షట్​డౌన్​ చేసేశాము. పరిస్థితిని అదుపుచేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాము. లాగిన్​ సేవలు మళ్లీ మొదలుపెట్టాము," అని ఓ ప్రకటనలో వెల్లడించింది ఆకాశ ఎయిర్​.

Akasa Air : ఎయిర్​లైన్స్​తో రిజర్ట్​ అయ్యి, వ్యక్తిగత వివరాలను పంచుకున్న ప్రయాణికులకు కూడా.. ఈ డేటా లీక్​ గురించి ఈ-మెయిల్స్​ పంపించింది ఆ సంస్థ. ఆందోళన చెందవద్దని ప్రయాణికులకు సూచించింది.

అయితే.. ప్రయాణికుల ట్రావెల్​ రికార్డులు, పేమెంట్​ వంటి సమాచారం.. డేటాలో లీక్​ అవ్వలేదని ఆకాశ ఎయిర్​ పేర్కొంది. తమ వ్యవస్థ భద్రతను త్వరలోనే సమీక్షించి, దానిని మరింత మెరుగుపరుస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ప్రయాణికులకు హామీనిచ్చింది.

గురువారం.. డేటా బ్రీచ్​ వ్యవహారం తెలుసుకున్న వెంటనే.. లాగిన్​ సేవలను నిలిపివేసింది విమానయాన సంస్థ. పరిస్థితిని పరిశీలించి.. కొన్ని రోజుల తర్వాత వాటిని పునరుద్ధరించింది. ఈ పూర్తి వ్యవహారంపై ప్రయాణికులకు క్షమాపణలు చెప్పుకుంది ఆకాశ ఎయిర్​.

"కస్టమర్ల సమాచారం రక్షణే.. ఆకాశ ఎయిర్​ ప్రథమ లక్ష్యం. కస్టమర్లకు మంచి అనుభూతిని కల్గించేందుకు మేము నిత్యం కృషి చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే మేము అప్డేట్​ అవుతూ ఉంటాము. డేటా లీక్​ వ్యవహారంపై క్షమాపణలు," అని ఓ ప్రకటనలో పేర్కొంది.

విమాన సేవలు..

Akasa Air routes : దివంగత రాకేష్​ ఝున్​ఝున్​వాలా మద్దతుతో ఆకాశ ఎయిర్​ సేవలు ఈ నెల 7న ప్రారంభమయ్యాయి. కొత్తగా కొనుగోలు చేసిన బీ737 మ్యాక్స్​ ఎయిర్​క్రాఫ్ట్​తో ముంబై- అహ్మదాబాద్​ ప్రయాణాలు సాగుతున్నాయి.

త్వ‌ర‌లో బెంగ‌ళూరు- ముంబై, బెంగ‌ళూరు -కొచ్చి, చెన్నై- ముంబైల మ‌ధ్య కూడా ఆకాశ ఎయిర్ విమాన సేవ‌లు ప్రారంభం కానున్నాయి.

విమాన సేవ‌ల కోసం మొత్తం 72 మ్యాక్స్​ విమానాల‌ను కొనుగోలు చేయ‌డానికి ఆకాశ ఎయిర్.. బోయింగ్​ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆకాశ ఎయిర్‌ సిబ్బంది యూనీఫామ్స్‌ను కూడా ఈ మ‌ధ్య‌నే ఆవిష్క‌రించింది. అవి మిగ‌తా విమాన‌యాన సంస్థ‌ల యూనీఫామ్స్ క‌న్నా చాలా డిఫ‌రంట్‌గా ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం