తెలుగు న్యూస్  /  ఫోటో  /  Akasa Air: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తరువాత ఆకాశ ఎయిర్‌వేస్ పరిస్థితి ఏంటి?

Akasa Air: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తరువాత ఆకాశ ఎయిర్‌వేస్ పరిస్థితి ఏంటి?

16 August 2022, 12:34 IST

Akasa Air: రాకేష్ జున్‌జున్‌వాలా ఆదివారం కన్నుమూశారు. ఈ పరిస్థితిలో అతని విమానయాన సంస్థ భవిష్యత్తు గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణంపై ఆకాశ్ విమానయాన సంస్థకు చెందిన మరో పెట్టుబడిదారుడు బుర్గిస్ దేశాయ్ స్పందిస్తూ ఈ సంస్థ నిర్వహణలో ఝున్‌ఝున్‌వాలా ప్రత్యక్ష జోక్యం ఉండదని చెప్పారు. సంస్థ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు.
(1 / 5)

ఆకాశ ఎయిర్ మెజారిటీ యాజమాన్యం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి చెందినది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ముగ్గురు పిల్లల పేర్లతో మూడు ట్రస్ట్‌ల ద్వారా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం ఆకాశలో 45 శాతం వాటాను కలిగి ఉంది. ఈ విమానయాన సంస్థ ప్యాసింజర్ సర్వీసులను ప్రారంభించిన వారం రోజుల్లోనే 62 ఏళ్ల వయసులో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు.
(2 / 5)
ఆకాశ ఎయిర్ మెజారిటీ యాజమాన్యం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి చెందినది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ముగ్గురు పిల్లల పేర్లతో మూడు ట్రస్ట్‌ల ద్వారా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం ఆకాశలో 45 శాతం వాటాను కలిగి ఉంది. ఈ విమానయాన సంస్థ ప్యాసింజర్ సర్వీసులను ప్రారంభించిన వారం రోజుల్లోనే 62 ఏళ్ల వయసులో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు.(Akasa Air)
ఆగస్ట్ 7న ఉదయం 10:05 గంటలకు ఆకాశ ఎయిర్ మొదటి విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.
(3 / 5)

జూలై 7న డీజీసీఏ నుండి ఆకాశ ఎయిర్ కార్యకలాపాల ఆరంభానికి సర్టిఫికేట్ పొందింది. ఆ తర్వాత టిక్కెట్లు అమ్మడం ప్రారంభించారు. ప్రారంభంలో, కంపెనీ ముంబై-అహ్మదాబాద్, బెంగళూరు-కొచ్చి మార్గాల్లో విమానయాన సేవలు అందిస్తోంది.
(4 / 5)

ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మార్గంలో ఆకాశ ఎయిర్ తన సేవలు ప్రారంభించింది. సెప్టెంబర్ 15న చెన్నై-ముంబై మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది. కానీ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా వాటిని చూసేందుకు సజీవంగా లేరు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి