Gowri Signatures : గౌరీ సిగ్నేచర్స్ని ప్రారంభించిన మహేశ్ బాబు- నమ్రత!
17 October 2023, 12:04 IST
- Gowri Signatures : వివాహ వస్త్రాలు, ఆభరణాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గౌరీ సిగ్నేచర్స్కు చెందిన కొత్త షోరూమ్‌ను సినీ నటుడు మహేశ్ బాబు ప్రారంభించారు. ఆ వివరాలు..
గౌరీ సిగ్నేచర్స్ని ప్రారంభించిన మహేశ్ బాబు- నమ్రత
Gowri Signatures Hyderabad : గౌరీ సిగ్నేచర్స్ అటేలియర్.. తాజాగా హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చింది. వివాహ వస్త్రాలకు సంబంధించిన ఈ గౌరీ సిగ్నేచర్స్ని ప్రముఖ నటుడు మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్లు ప్రారంభించారు.
హస్తకళా నైపుణ్యం, ప్రత్యేకతకు సాక్ష్యంగా నిలుస్తూ ఫ్యాషన్‌ను ఆచరించే వారు, చూపరుల దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెం. 36లో గౌరి సిగ్నేచర్స్ ప్రారంభమైంది. ఈ స్టోర్ 15000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. లెవెల్ 2లో అందమైన డిజైన్స్, వింటేజ్ ఫర్నిచర్‌తో అలంకరించి ఉంటుంది ఈ స్టోర్. నచ్చిన దుస్తులు ఎంచుకునేలా లగ్జరీ, చక్కదనంతో కూడిన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది ఈ షోరూమ్.
నిశ్చితార్థం అయిన జంటలతో పాటు పిల్లల నుంచి ఇంట్లోని వృద్ధులు/ పెద్దవారి వరకు మొత్తం కుటుంబానికి వస్త్రాలతో పాటు సరితూగే ఆభరణాలను కూడా అందిస్తుంది గౌరీ సిగ్నేచర్స్.
అనేక ప్రముఖ బ్రాండ్స్‌తో..
హైదరాబాద్‌లో ఉన్న ఒక తయారీ సౌకర్యంతో 3 తరాలకు పైగా క్లిష్టమైన చేనేత పనితనం, ఎప్పటికి నిలిచిపోయే డిజైన్స్ ద్వారా ప్రసిద్ధి పొందిన గౌరి సిగ్నేచర్స్ వారు భారతదేశంలోని అనేక ప్రముఖ బ్రాండ్ల స్టోర్లకు వారి వస్త్రాలను అందించారు.
లాంచ్ ఈవెంట్లో గౌరీ సిగ్నేచర్స్ సీఈఓ ఉదయ్ సాయి కౌతవరపు మాట్లాడారు. తమ బ్రాండ్‌కి ఉన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ తయారీ నుంచి రిటైల్ వరకు.. ప్రత్యేకమైన బెస్పోక్ వెడ్డింగ్ సిగ్నేచర్ ఎంసెంబ్ల్స్ బ్రాండ్‌గా అభివృద్ధి చేశారమని అన్నారు.
“వధూవరులు, వారి కుటుంబం మొత్తం పెళ్లి కోసం ఎంచుకునే కస్టమ్ డిజైనర్ డ్రెస్‌లు మాత్రమే కాకుండా.. ఆ దుస్తులకు సరిపోయే ఆభరణాలను కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ గౌరీ సిగ్నేచర్స్ పుట్టింది. ఇది కేవలం బట్టలనే కాదు వైభవాన్ని ప్రతిబింబించే కథలు, భారతదేశ గొప్ప వారసత్వం, ప్రతి వ్యక్తి ప్రయాణం. అందాన్ని కథలుగా చేస్తుంది,” అని సీఈఓ ఉదయ్ అన్నారు.
స్టోర్‌లో హైలైట్స్..!
ప్రతి వివాహ కథలోని మరపురాని క్షణాలను నిక్షిప్తం చేసేలా గౌరి సిగ్నేచర్స్ నిబద్ధతను కనబరిచింది. వధువుతో పాటు కుటుంబంలోని మహిళల కోసం గౌరి సిగ్నేచర్స్, దేశంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా బనారసి సిల్క్లోని రాజాకర్షణ లేదా కాంజీవరంలోని క్లిష్టమైన కళాత్మకత.. ఇలా వధువుకి చెందిన ప్రత్యేక రోజును సంపూర్ణంగా పూర్తి చేసే వన్ స్టాప్ స్టోర్.. ఈ గౌరీ సిగ్నేచర్స్.
ఇక వరుడు, అతని కుటుంబం కోసం గౌరి సిగ్నేచర్స్ రాజరిక వైభవంతో పాటు అధునాతనతతో కూడిన సింఫొనీని అందజేస్తుంది. షెర్వానీలో క్లాసీ లుక్, బంధ్గాలాలోని కాలాతీత ఆకర్షణ వరకు ఇక్కడ అన్నింటినీ చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దడం జరిగింది. వరుడి
సిగ్నేచర్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ కేవలం ఒక ఈవెంట్ కాదు. ఇది వ్యక్తిత్వం, నైపుణ్యం, విలాసవంతమైన జీవితాన్ని కలగలిపిన వేడుక. చక్కదనం వ్యక్తిగత వ్యక్తీకరణను పలకరిస్తు ప్రపంచాన్ని స్వీకరించడానికి ప్రయత్నించేవారిని ఆహ్వానించిన అందమైన వేడుక.