తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men's Fashion: అబ్బాయిలు ఈ ఫ్యాషన్ చిట్కాలు తెలుసుకుంటే.. అమ్మాయిల దృష్టి మీమీదే..

Men's fashion: అబ్బాయిలు ఈ ఫ్యాషన్ చిట్కాలు తెలుసుకుంటే.. అమ్మాయిల దృష్టి మీమీదే..

HT Telugu Desk HT Telugu

11 June 2023, 17:31 IST

google News
  • Men's fashion: స్టైలిష్ గా కనిపించాలంటే రోజూ  కొత్త బట్టలే వేసుకోవాల్సిన పనిలేదు. కొన్ని ఫ్యాషన్ సూత్రాలు తెలుసుకుంటే చాలు. ప్రత్యేకంగా కనిపించొచ్చు.

అబ్బాయిల కోసం ఫ్యాషన్ చిట్కాలు
అబ్బాయిల కోసం ఫ్యాషన్ చిట్కాలు (Photo by Twitter/Mariposa732)

అబ్బాయిల కోసం ఫ్యాషన్ చిట్కాలు

అబ్బాయిల ఫ్యాషన్ అంటే ఆడంబరంగా ఉండదు. సింపుల్ చిట్కాలు పాటిస్తే స్టైలిష్ గా కనిపించేయొచ్చు. ఇలా చేయడమే ఫ్యాషన్ అనుకొని చేసే కొన్ని తప్పులను చేయకపోతే చాలు. కళ్లు తిప్పుకోలేని లుక్ మీ సొంతం అవుతుంది. అవేంటో తెలుసుకోండి.

1. ప్రత్యేకత:

స్టైల్ అంటే మీకు నప్పేది. మీరు వేసుకునే బట్టల్లో మీ వ్యక్తిత్వం కనిపించాలి. కొత్త కొత్త ట్రెండ్స్, రంగులు, ప్యాటర్న్ లు ఉన్న బట్టలు ఎంచుకోండి. కానీ అవి మీకు నప్పాలి. అలాగనీ ఏ రిస్క్ చేయకుండా ఉండకండి. మీకు సౌకర్యంగా ఉన్నంతవరకూ కొత్త ప్రయత్నాలు చేయండి.

2. ఫిట్టింగ్:

చిన్న చిన్న విషయాల్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే చాలా ప్రొఫెషనల్ గా కనిపించొచ్చు. స్లీవ్స్ పొడవు, ట్రైజర్ హెమ్, జాకెట్ షోల్డర్స్ ఫిట్టింగ్ పక్కాగా ఉండేలా చూసుకోండి. ఎలా ఉన్నా పరవాలేదని వదిలేయకుండా టైలర్ తో ఫిట్టింగ్ చేయించుకోండి.

3. నాణ్యత:

నాణ్యమైన బట్టలనే ఎంచుకోండి. చూడటానికి బాలేని పది చొక్కాలు కొనే బదులు, మంచి నాణ్యత, ఫిట్టింగ్ ఉన్న రెండు చొక్కాలు కొనుక్కోండి. సూట్స్, షర్టులు, షూ విషయంలో ఈ నియమం పాటించాలి. అలాంటివి ఎక్కువ రోజులు మన్నుతాయి, సౌకర్యంగానూ ఉంటాయి.

4. డిటేలింగ్:

చేతికి వాచీ, బెల్ట్, పాకెట్ స్క్వేర్స్ వల్ల స్టైలిష్ గా కనిపించొచ్చు. మీరు వేసుకునే షూ కూడా శుభ్రంగా ఉండాలి. పాలిష్ వేసుకోవాలి. ఇవన్నీ మీ పూర్తి లుక్ మీద ప్రభావం చూపిస్తాయి.

5. సందర్భానికి తగ్గట్లుగా:

వేడుక, సందర్భం తగ్గట్లు మీ డ్రెస్సింగ్ ఉండాలి. బిజినెస్, లేదా వృత్తి పరమైన వేడుకలకు ఫార్మల్స్, క్యాజువల్స్ ఎంచుకోవచ్చు. లేయరింగ్ టెక్నిక్ వాడి ప్రత్యేకత తీసుకురావచ్చు. అంటే బ్లేజర్, సూట్ వాడటం.

6. ఆత్మవిశ్వాసం:

కాన్ఫిడెన్స్ తో ఉండటం చాలా ముఖ్యం. మంచి బట్టలు వేసుకున్నా మీ నడకలో, మాటలో గాంభీర్యం లేకపోతే వృధాయే. నిదానంగా నడక, మెడలు వాల్చకుండా స్టిఫ్ గా, నిటారుగా నడవటం చాలా ముఖ్యం.

7. ఫ్యాషన్‌కి తగ్గట్లు:

ప్రతిరోజూ ఏదో ఒక ఫ్యాషన్ ట్రెండింగ్ లో ఉంటుంది. కానీ దాన్ని మీకు నప్పట్లు మీ వస్త్రధారణలో భాగం చేసుకోవాలి. ఫ్యాషన్ నిపుణులు, మ్యాగజైన్లు ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటో తెలుసుకోండి.

  • ఫ్యాషన్ అంటే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ మీరే అలవాటు చేసుకోవాలి. ఏదిబడితే అది కాకుండా మీకేది నప్పుతుందో తెలుసుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం పెంచేట్లు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ మార్చుతూ ఉండాలి. అది మీకు నప్పేట్టు ఉండాలని గుర్తుంచుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం