DA hike : డీఏ పెంపుపై కేంద్రం కసరత్తు.. దసరాలోపు ఉద్యోగులకు గుడ్ న్యూస్!
19 September 2022, 15:50 IST
- 7th pay commission DA hike : డీఏ పెంపుపై కేంద్రం కసరత్తులు చేస్తోంది! దసరాలోపు 4శాతం డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది.
డీఏ పెంపుపై కేంద్రం కసరత్తు.. దసరాలోపు ఉద్యోగులకు గుడ్ న్యూస్!
DA hike news in Telugu : పండుగ సీజన్ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది! డీఏ(డియర్నెస్ అల్లోవెన్స్) పెంపుపై కేంద్రం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. దసరాలోపు ఈ విషయంపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
7th pay commission DA hike : డీఏ పెంపు ఎంతంటే..
మీడియా కథనాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4శాతం పెరగవచ్చు. ప్రస్తుతం 34శాతం ఉన్న డీఏ.. 38శాతానికి చేరవచ్చు. డీఏ పెంపుతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు జులై, ఆగస్టు నెలకు సంబంధించిన ఏరియర్స్ కూడా దక్కొచ్చు.
DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి డీఏని ప్రతి యేటా రెండుసార్లు సవరిస్తారు. మొదటిది జనవరి నుంచి జూన్ వరకు ఇస్తారు. రెండోది డిసెంబర్ నుంచి జులై వరకు ఇస్తారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏని పెంచుతున్నట్టు ఈ ఏడాది మార్చ్ 30న ప్రకటించింది కేంద్రం. ఫలితంగా డీఏ 34శాతానికి చేరింది. 1.16కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందారు. 7వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల మేరకు అప్పుడు డీఏ పెంచింది కేంద్రం.
ఒడిశాలో 3శాతం డీఏ పెంపు..
Odisha government employees DA hike : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏని పెంచుతున్నట్టు ఒడిశా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 3శాతం డీఏ పెంపును ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనను సీఎం నవీన్ పట్నాయక్ నేడు ఆమోదించారు.
ఫలితంగా ఒడిశా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ.. 31శాతం నుంచి 34శాతానికి చేరింది. ఇది 2022 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది.