Central government employees da hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఎంత పెరగనుంది
04 August 2022, 10:57 IST
- Central government employees da hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండుసార్లు కరువు భత్యం పెరగుతుంది.
Central government employees da hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న డీఏ (ప్రతీకాత్మక చిత్రం)
Dearness allowance: ఈ ఏడాది ద్వితీయార్థంలో కరువు భత్యాన్ని కేంద్ర మంత్రివర్గం సవరించాల్సి ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుండి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్భణం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ కేంద్ర మంత్రివర్గం డీఏ(dearness allowance) పెంచే అవకాశం ఉంది.
జనవరి తరువాత డీఏ రెండో సవరణ ఇది. డీఏ 3 నుండి 4 శాతం మధ్య పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం..
7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం 2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డీఏను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ సమయంలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు.
దీనికి అదనంగా అక్టోబరులో మరోసారి కేంద్రం డీఏ పెంచింది. 2021 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 3 శాతం డీఏ పెంపునకు గత ఏడాది అక్టోబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ జూలై 1, 2021 నుండి 31 శాతం డీఏ లభించింది
2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం డీఏను మరో 3 శాతం పెంచాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34 శాతం డీఏ లభిస్తోంది.
7వ కేంద్ర వేతన సంఘం సిఫారసుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం డీఏ పెంపు వర్తిస్తుంది. పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) ను అదే మొత్తంలో పెంచారు.
బేసిక్ పే అనే పదానికి 7వ పే కమిషన్ మ్యాట్రిక్స్ ప్రకారం తీసుకున్న వేతనం అని, ప్రత్యేక వేతనం వంటి ఇతర రకాల వేతనాన్ని చేర్చలేదని కేబినెట్ నోటిఫికేషన్లో పేర్కొంది.
dearness allowance ఎప్పుడు ప్రకటిస్తారు?
సాధారణంగా ఏడాదికి రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రకటిస్తుంది. ఈ రెండు సవరణలకు సంబంధించిన ప్రకటన సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబరులో వెలువడుతుంది.
అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా, 2019 డిసెంబర్ 31 తర్వాత దాదాపు 18 నెలల పాటు డీఏను సవరించలేదు.
2020 జనవరి నుంచి 2021 జూన్ మధ్య డీఏ పెంపును నిలిపివేశారు. గత ఏడాది జూలైలో డీఏను పెంచారు.
dearness allowance అంటే ఏమిటి?
పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్టుగా సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం అందిస్తారు.
రిటైల్ ద్రవ్యోల్బణ రేట్లను పరిగణనలోకి తీసుకొని డీఏ రేటును కేంద్రం ఎప్పటికప్పుడు సవరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
ప్రస్తుతం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ ప్రయోజనాలను పొందుతున్నారు.
dearness allowance ఎంత పెరుగుతుంది?
నెలకు రూ. 30,000 మూల వేతనం ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుత డిఎ రేటు 34 శాతానికి అనుగుణంగా రూ. 10,200 డీఏ పొందుతారు.
తాజాగా డీఏ మరో 4 శాతం పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందితే ఈ లెక్కన రూ. 30 వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ. 1200 పెరుగుతుంది. మొత్తం డీఏ 38 శాతం చేరి.. పెంచిన డీఏతో కలిపి రూ. 11,400కు చేరుకుంటుంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 1 న రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డిఎ) ను ప్రస్తుతం ఉన్న 31 శాతం నుండి 34 శాతానికి పెంచింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త డీఏ ఆగస్టు 2022 నుండి అమల్లోకి వస్తుంది. ఉద్యోగులు పెంచిన మొత్తాన్ని వారి సెప్టెంబర్ వేతనంలో పొందుతారు.
కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డీఏను రూపొందించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
టాపిక్