Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో ఈ సీట్లపైనే అందరి దృష్టి.. గెలిచేదెవరు?
07 April 2023, 7:45 IST
2023 Karnataka Assembly Elections : కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిపై అందరి దృష్టిపడింది. ఈ సీట్లల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు? అని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో ఈ సీట్లపైనే అందరి దృష్టి.. గెలిచేదెవరు?
2023 Karnataka Assembly Elections : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయిలో ఉంది. ప్రచారాలు, హామీలు, మాటల యుద్ధాలతో అక్కడి వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ 224లో కొన్ని నియోజకవర్గాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ సీట్లల్లో మళ్లీ గెలివాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావిస్తుంటే.. వారి నుంచి కీలకమైన నియజకవర్గాలను లాగేసుకోవాలని ఇంకొందరు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలో.. ఆ నియోజకవర్గాలేంటి? పోటీదారులెవరు? వంటి వివరాలు తెలుసుకుందాము..
సీఎం.. మాజీ సీఎం.. దిగ్గజ నేతల సీట్లు..!
షిగ్గావ్:- ఇది సీఎం బసవరాజ్ బొమ్మై నియోజకవర్గం. 2018 ఎన్నికల్లో 9,265 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రిపై గెలుపొందారు.
Karnataka Assembly Elections schedule : వరుణ:- 2018 ఎన్నికల ముందు వరకు ఇది కాంగ్రెస్ దిగ్గజ నేత సిద్ధరామయ్య కంచుకోట. నాటి ఎన్నికల్లో తన కుమారుడు యథంద్రాకు అప్పగించారు. సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో (చాముండేశ్వరి, బదామి)లో పోటీచేశారు. బదామీలో గెలిచారు. ఇప్పుడు మళ్లీ తన కంచుకోట నుంచే పోటీచేస్తున్నారు సిద్ధరామయ్య.
రామనగర:- మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి సతీమణి, మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు అనిత కుమారస్వామి.. 2018లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి.. కుమారస్వామి తనయుడు నిఖిల్ ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు నిఖిల్.
BJP Karnataka Assembly Elections : మాండ్య:- జేఎడ్ఎస్కు చెందిన ఎం శ్రీనివాస్.. 2018ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్, బీజేపీలో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. కాగా ఇప్పుడు ఈ సీటులో పోటీ చేసే బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్టు.. స్వతంత్ర ఎంపీ సుమలత ఇటీవలే ప్రకటించారు.
కనకపుర:- కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కంచుకోట ఇది. ఇక్కడి నుంచి ఆయన 7సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి ఇక్కడ జరిగిన అన్ని ఎన్నకల్లోనూ ఆయనే గెలిచారు.
హసన్:- 2018 ఎన్నికల ముందు వరకు ఈ సీటు.. జేడీఎస్‌కు కంచుకోగా ఉండేది. కానీ నాటి ఎన్నికల్లో బీజేపీ ప్రీథమ్ గౌడె.. జేడీఎస్‌కు షాకిచ్చారు. 13వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఇక్కడి టికెట్ విషయంపై జేడీఎస్‌లో అంతర్గత కుమ్ములాట నెలకొన్నట్టు తెలుస్తోంది.
Congress Karnataka Assembly Elections : కోలర్:- ఈ నియోజకవర్గంలో జేడీఎస్‌కు చెందిన శ్రీనివాస గౌడ సిట్టింగ్ ఎమ్మెల్యగా ఉన్నాయి. కాగా.. గత రాజ్యసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఇది జేడీఎస్‌కు నచ్చలేదు. ఇప్పుడు మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చెన్నపట్నా:- 2018లో చెన్నపట్నా నుంచి పోటీ చేసిన హెచ్డీ కుమారస్వామి.. స్థానికంగా పేరుమోసిన సీపీ యగేశ్వరను ఓడించారు. వాస్తవానికి ఆయన్ని ఓడించేందుకు కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీచేశారు. 2023లోనూ ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు కుమారస్వామి.
షికారిపుర:- మాజీ సీఎం, బీజేపీ దిగ్గజం, లింగాయత్ నేత యడియూరప్ప కంచుకోట ఇది. ఆయన రిటైర్ అవ్వడంతో ఇది ఖాళీ అయ్యింది. అయితే.. ఆయన కుమారుడు బీవై విజయేంద్రకు ఈ సీటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
2023 Karnataka Assembly Elections : శివమొగ్గ:- ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు కేఎస్ ఈశ్వరప్ప. అవినీతి ఆరోపణల కారణంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
సోరాబా:- ఇక్కడి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు కుమార బంగారప్ప. ఆయన.. తన సోదరుడు మధు బంగారప్పపై పోటీ చేసి 2018లో గెలిచారు. వీరిద్దరు మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమారులు. గత ఎన్నికల్లో మధు బంగారప్పకు జేడీఎస్ సీటు ఇచ్చింది. ఆయన ఈసారి కాంగ్రెస్‌లో ఉన్నారు.
మే 10న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. మరి ఈ సీట్లల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.